HIT 3 నాని.. హై వోల్టేజ్ కిల్లర్ లుక్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-01 08:18 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని.. ఇప్పుడు హిట్-3 మూవీతో బిజీగా ఉన్నారు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


భారీ బడ్జెట్ తో ప్రశాంత్ తిరిపనేని నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా కాశ్మీర్ లో బిగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు మేకర్స్. కీలకమైన సన్నివేశాలు షూట్ చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఇంటెన్స్ లుక్ తో నాని అదరగొట్టేశారు. కంచె వెనుక వేటాడే సింహంలా కనిపిస్తున్నారు. మీసాలు దువ్వుతున్న అర్జున్ సర్కార్ గా దుమ్ము దులిపేశారని చెప్పాలి.

ఇప్పుడు నాని కొత్త పోస్టర్ పై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. నాని లుక్స్ చూసి ఎగ్జైట్ అవుతున్నట్లు అంటున్నారు. అయితే మేకర్స్ కూడా.. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో గత చిత్రాలకు మంచి హిట్-3ని రూపొందిస్తున్నారు.

శైలేష్ కొలను ఈ చిత్రాన్ని స్టైలిష్ గా, స్లీక్ గా తెరకెక్కిస్తున్నారు. బోల్డ్, గ్రిటీ, బ్లడీగా ఉంటుందని మేకర్స్ పేర్కొంటున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు. సినిమాను 2025 మే 1న అన్ని చోట్లా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే హిట్-3పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్-3తో నాని సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు. నాని చేతిలో ప్యారడైజ్ మూవీ కూడా ఉంది. ఆ సినిమాను దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు కూడా హిట్ అయితే ఇక నానికి తిరుగులేనట్లే. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News