బాబు కేరాఫ్ రాజమండ్రి జైల్.....14 రోజుల రిమాండు

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లనున్నారు. ఆయనకు పద్నాలుగు రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీపీ న్యాయమూర్తి హిమబిందు సంచలన తీర్పు చెప్పారు.

Update: 2023-09-10 13:38 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లనున్నారు. ఆయనకు పద్నాలుగు రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీపీ న్యాయమూర్తి హిమబిందు సంచలన తీర్పు చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి దాదాపుగా ఏడు గంటలకు పైగా సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగిన మీదటనే ఏసీపీ కోర్టు ఈ కీలక తీర్పుని వెలువరించింది.

చంద్రబాబు మీద పెట్టిన కేసులో 409 సెక్షన్ చాలా ముఖ్యమైనదిగా ఉంది. దీని వల్లనే రిమాండుకు బాబును పంపినట్లుగా అయింది అని అంటున్నారు. దాదాపుగా పది నుంచి పన్నెండు సెక్షన్లలో కేసు పెట్టింది ఏపీ సీఐడీ. సీఐడీ అధికారులు తమ రిమాండు రిపోర్టులో కీలకమైన అంశాలు అన్నీ కూడా కోర్టు ముందు పెట్టగలిగారు.

సమర్ధవంతమైన వాదనను ఏపీ సీఐడీ కోర్టులో వినిపించింది అని అంటున్నారు. బాబు అవినీతి చేశారు అన్నది ప్రాధమిక ఆధారాలను చూపించడంతో సీఐడీ విజయవంతం అయింది. ఏపీ సీఐడీ అన్ని రకాలైన ప్రొసీజర్స్ తోనే చంద్రబాబుని అరెస్ట్ చేసిందని భావిస్తూనే తీర్పు చెప్పారు.

ఇక ఈ కేసులో చంద్రబాబునాయుడు అవినీతి ప్రమేయం ఉందని సీఐడీ ఆధారాలు చూపించగలిగింది. అదే విధంగా చూస్తే ఈ కేసులో వాట్సప్ చాటింగ్ అన్నది అతి ముఖ్య ఆధారంగా ఉంది అని అంటున్నారు. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అన్న బాబు తరఫున న్యాయవాదుల వాదనను కోర్టు తిరస్కరించింది.

ఇదిలా ఉండగా చంద్రబాబుని రాజమండ్రి జైలుకు తరలించడానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక చంద్రబాబుని రాజమండ్రి జైలుకు తరలించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రోడ్ అంతా క్లీన్ చేస్తూ పకడ్బంధీగా కూడా బందోబస్తుని చేస్తున్నారు ఇదిలా ఉండగా హై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అని ఈ తీర్పులో పేర్కొనడంతో రేపు మధ్యాహ్నం లంచ్ మోషన్ ని టీడీపీ తరఫున న్యాయవాదులు మూవ్ చేస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News