బాబుకు భారం తగ్గిస్తున్న లోకేష్

జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బాబు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. అలాగే పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయి

Update: 2024-07-18 03:48 GMT

తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా ఉన్న మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ అధినేత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు బరువు బాధ్యతలను పూర్తిగా పంచుకుంటున్నారు. చంద్రబాబు ఏపీకి సీఎం గా ఉన్నారు. ఖజానా ఖాళీగా ఉండి వెక్కిరిస్తోంది. అదే టైం లో కేంద్రంలో కీలకంగా టీడీపీ ఉంది.

జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బాబు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. అలాగే పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయి. పోలవరం అమరావతి వంటి బిగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం బిగ్ టాస్క్ గా ఉంది. కూటమిలో పెద్దన్నగా అందరినీ కో ఆర్డినేట్ చేసుకోవడం మరో బాధ్యత.

ఇలా బాబుకు అనేక రకాలుగా ఒత్తిళ్ళు ఉన్నాయి. దాంతో ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలలో సైతం నారా లోకేష్ చురుకుగా మారారు. ఒక విధంగా చెప్పాలీ అంటే పార్టీ బాధ్యతలను ఆయనే చూస్తున్నారు అని అంటున్నారు.

పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు లోకేష్ టచ్ లో ఉంటున్నారు. చినబాబు అందుబాటులోకి రావడంతో వారు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారుట. చంద్రబాబు వద్దకు వెళ్ళకుండానే వారి సమస్యలు ఇబ్బందులు అన్నీ తెలుసుకుని వారికి తగిన పరిష్కారాలు చూపుతున్నారు అని అంటున్నారు.

అలా ప్రతీ రోజూ ఎమ్మెల్యేలను కలుసుకోవడం కోసం లోకేష్ కొంత సమయం కేటాయించారు అని అంటున్నారు. వారి విన్నపాలు వినతులు వింటూ లోకేష్ పార్టీ పరంగా అండగా ఉంటున్నారు అని అంటున్నారు. తమ నియోజకవర్గంలోని ఇబ్బందులను ఎమ్మెల్యేలు లోకేష్ కి తెలియచేస్తున్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రులకు చెప్పాలని వారు అంటున్నారు.

వీటి మీద లోకేష్ పూర్తి బాధ్యత తీసుకుని పరిష్కరిస్తూండడంతో ఎమ్మెల్యేలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆయా నియోజకవర్గంలో పార్టీలో ఉన్న సమస్యలు వర్గ పోరు వంటివి కూడా లోకేష్ దృష్టి వస్తే వెంటనే ఆలస్యం చేయకుండా నాయకులతో మాట్లాడి అంతా ఒక్కటిగా ఉండేలా చూస్తున్నారు అని అంటున్నారు.

ఈ రకమైన మెకానిజం లేకనే జగన్ ఇటీవల అధికారాన్ని పోగొట్టుకున్నారు అని అంటున్నారు. పార్టీకి నాయకత్వం ఎపుడూ దగ్గరగా ఉండాలని అంటున్నారు. ఒకవేళ అసంతృప్తి ఏ నేతలో అయినా ఉన్నా అది కాస్తా దావానలం గా మారి మంట పెట్టేలా లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇపుడు లోకేష్ ఆ పని చేస్తున్నారు. దాంతో చంద్రబాబుకు కొంత భారం తగ్గుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News