పవన్ స్టైల్ లో లోకేష్...ఏకవచనంతో...!

చాలా కాలంగా నారా లోకేష్ జగన్ని ఏకవచనంతోనే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇపుడు పూర్తిగా స్టైల్ మార్చారు.

Update: 2023-07-23 03:53 GMT

చాలా కాలంగా నారా లోకేష్ జగన్ని ఏకవచనంతోనే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇపుడు పూర్తిగా స్టైల్ మార్చారు. ప్రతీ మాటకు చివరన జగన్ అంటూ క్వశ్చన్ వేస్తూ తన స్పీచ్ ని కొనసాగించారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ ఇలాగే దీనికి జవాబు చెప్పు జగన్ అంటూ మాట్లాడారు.

మార్కాపురం సభలో లోకేష్ అయితే జగన్ మీద తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఎంతలా అంటే జగన్ తో పర్సనల్ అటాక్ అయితే చూసుకుందాం అంటూ సవాల్ చేసేలా. ఇలాంటి సవాల్ నే పవన్ ఇటీవల చేశారు. మరి అది బాగుందని తానూ ఫాలో అయ్యారో లేక తన స్పీచ్ లో అగ్రెసివ్ నెస్ ఉండాలని భావించారో కానీ ఘాటుగానే మాట్లాడారు.

నీవొక క్రిమినల్ వి జగన్ అన్నారు. ఇదే మాట పవన్ కూడా అనడం విశేషం. నీకూ నాకూ పోలికేంటి అని పవన్ అంటే ఇపుడు లోకేష్ అదే మాట అన్నారు. అంతే కాదు క్యారెక్టర్ అంటే తనదని, తనకు ఉందని జగన్ కి లేనిదీ అదే అంటూ రెట్టించి మాట్లాడారు.

ఇక తనకు కాలేజీ మేట్స్ ఉన్నారన్ని జగన్ కి జైలు మేట్స్ ఉన్నారని సెటైర్లు వేశారు. పవన్ ప్రస్తావించినట్లుగానే జగన్ పరీక్షా పత్రాలు దొంగతం చేశారు అని సేం టూ సేం ఆరోపణ చేశారు. ఇక బాబాయ్ ని గుండె పోటు అంటూ చంపేశారని, తల్లినీ చెల్లెలుని గెంటేశారు అని పాత ఆరోపణలనే చేశారు.

వీటికి మించి ఒక ఘాటైన ఆరోపణ చేశారు. నా గురించి చూడాలీ అంటే యూట్యూబ్ వెతకాలేమో. నీ గురించి చెప్పాలంటే గూగుల్ టేకవుట్ చాలు, ఎవరు ఎవరికి కాల్ చేశారు, ఎంత టైం మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరూ ఎన్నిసార్లు కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారో తెలిస్తే నీకు గుండెపోటు వస్తుంది అంటూ లోకేష్ కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. అంతే కాదు రౌడీ పిల్లగాడు అని పవన్ అంటే లోకేష్ ఫ్రస్ట్రేషన్ బాయ్ అని జగన్ని అంటున్నారు.

ఇలా లోకేష్ జగన్ మీద తన మాటల ధాటీతో అనాల్సినవి అన్నీ అనేశారు. దానికి కారణం వెంకటగిరి సభలో లోకేష్ పేరెత్తకుండా పట్టపగలు మందు తాగుతూ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్స్ లో ఒకడు కనిపిస్తాడు, యూట్యూబ్ లో చూడండి అని జగన్ అన్నారు. దానికి ఒక రోజు ఆలస్యంగానో లేక గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయి అన్నారో తెలియదు కానీ లోకేష్ కౌంటర్ వేశారు. మరి దీనికి వైసీపీ నుంచి బదులు ఇస్తారా లేక లైట్ తీసుకుంటారా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News