పవన్ మీద లోకేష్ కంప్లైంట్ ..!?

ఏపీలో కొత్తగా పాత పొత్తు కుదిరింది. టీడీపీ వంటి లబ్ద ప్రతిష్టమైన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది

Update: 2023-10-25 11:07 GMT

ఏపీలో కొత్తగా పాత పొత్తు కుదిరింది. టీడీపీ వంటి లబ్ద ప్రతిష్టమైన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. జనసేనలో ఏమి ఉంది, ఏమి లేదు అంటే దానికి ఒక్కటే సమాధానం. పవన్ ఉన్నారు అని మాత్రమే. వన్ అండ్ ఓన్లీ పవన్ గ్లామర్ ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం మీద ఆశతోనే టీడీపీ జనసేన తో జత కట్టింది.

అయితే రాజకీయంగా చూసినా విశ్లేషించినా లేక అనేక రకాలైన కోణాలను పరిశీలించినా కూడా టీడీపీకి ఉన్న బలం బలగం వేరు. జనసేన వేరు. రెండు పార్టీలను పోల్చడం కూడా కుదరదు. అయితే రాజకీయాలలో కష్ట కాలాలు ఉంటాయి. అలాగే అవసరాలు కూడా ఉంటాయి. దాని వల్ల కొన్ని సార్లు వేరే పార్టీలతో ఆపదమొక్కుల అవసరాలు పడతాయి.

అలా కనుక చూసుకుంటే జనసేన అవసరం ఇపుడు టీడీపీకి అలా పడింది. అయితే జన సేన టీడీపీ కాపురం సవ్యంగా ఉందా అంటే అది ముందు ముందు చూసి చెప్పాలి. చంద్రబాబు పవన్ కాంబో వేరు, అదే పవన్ లోకేష్ అంటే ఇక్కడ పవనే ముందు కనిపిస్తారు. దానికి కారణం పవన్ సినీ గ్లామర్ కూడా అతి ముఖ్య కారణం. అలా ఇపుడు పవన్ ముందు లోకేష్ వెల వెల బోతున్నారా అంటే తాజాగా రాజమండ్రిలో జరిగిన రెండు పార్టీల ఉమ్మడి మీడియా మీట్ చూస్తే చాలు అర్ధం అయిపోతుంది.

పవన్ ఉల్లాసంగా చాలా కంఫర్టబుల్ గా ఉంటూ మీడియాని ఫేస్ చేశారు. అదే లోకేష్ అయితే తడబడుతూ కనిపించారు అని అంటున్నారు. ఇక బాడీ లాంగ్వేజ్ ని చూసినా పవన్ ఫుల్ జోష్ లో ఉంటే లోకేష్ కొంత సైలెంట్ గా కనిపించారు. ఇక మీడియా మీట్ లో పవనే ఒక విధంగా డామినేట్ చేశారు అన్న చర్చకు కూడా తెర లేచింది.

ఇవన్నీ పక్కన పెడితే జనసేన టీడీపీ తొలి కో ఆర్డినేషన్ మీటింగ్ కి ముందే తండ్రి చంద్రబాబుని జైలులో లోకేష్ కలిశారు. ఆయన నుంచి సలహా సూచనలు తీసుకున్నారు అని కూడా ప్రచారం సాగింది. ఈ సందర్భంగానే లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు వద్ద కంప్లైంట్ చేశారు అని ప్రచారం కూడా సాగుతోంది.

అదేంటి రెండు పార్టీలు ఒక్కటి కదా. పవన్ లోకేష్ కలసి అంతకు ముందు కూడా మీడియా మీటింగ్ ని రాజమండ్రి జైలు బయట నిర్వహించారు కదా అని అనుకోవచ్చు. ఆ మీటింగ్ లోనే పవన్ డామినేషన్ చేశారు అన్నదే లోకేష్ బాధ అని అంటున్నారు. అదే విషయాన్ని ఆయన తన తండ్రితో చెప్పుకున్నారని అంటున్నారు. పవన్ మాటలు దూకుడు అంతా టీడీపీని సైతం తన వైపునకు తిప్పుకునే విధంగా ఉందన్నది లోకేష్ అనుమానంగా చెబుతున్నారు అని అంటున్నారు.

ఇక ఆ మధ్య నాలుగవ విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆ యాత్ర సందర్భంగా ఆయన టీడీపీ వీక్ గా ఉంది అని మాటలు వదిలారు. అంతే కాదు, వారు కష్టాలలో ఉన్నారు, మనం చేయూత ఇవ్వాలి, వారిని ఏమీ అనకూడదు అన్న మాటలు వాడారు. ఇక టీడీపీ అనుభవం జనసేన యువరక్తం అంటూ కూడా మాట్లాడారు.

ఇవన్నీ కూడా సరిచూసుకున్న మీదటనే లోకేష్ కొంత అభద్రతా భావంతో ఉన్నరని అంటున్నారు. పవన్ డామినేటింగ్ రోల్ ప్లే చేస్తున్నారు అన్నదే చినబాబు ఆవేదనగా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు బయట ఉంటే పవన్ కళ్యాణ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండేదో కానీ లోకేష్ చేతిలో పార్టీ ఉండడంతో టీడీపీ కంటే జనసేన బలమైన పార్టీగా ఆయన భావిస్తున్నారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.

దాంతోనే లోకేష్ తన మదిలో మాటలను తండ్రితో పంచుకున్నారని అని అంటున్నారు. ఒక విధంగా పవన్ లోకేష్ కాంబో కానీ ఈ ఇద్దరు ఫోటో కానీ చూస్తే ఈ ఫ్రేం లో పవన్ బాగా కనిపిస్తారు. ఆయనే అందరికీ గట్టిగా ఆనతారు. అదే ఇపుడు లోకేష్ టీం ఆవేదన అని అంటున్నారు. పవన్ పక్కన ఉంటే లోకేష్ లీడర్ షిప్ కూడా బాగా తగ్గినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక చూస్తే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో చేస్తున్న ప్రకటనలు అన్నీ చూస్తే టీడీపీ లీడర్ షిప్ కొంత సంక్షోభంలో ఉందని భావిస్తున్నట్లుగానే ఉంది అంటున్నారు. దాంతో ఇదే అదనుగా టీడీపీని కబ్జా చేసే వ్యూహాలు కూడా జనసేన వైపు నుంచి పదునెక్కుతున్నాయా అన్నది కూడా డౌటానుమానంగా ఉంది అని అంటున్నారు.

దాంతో ఈ రకమైన సందేహాలను అన్నింటినీ లోకేష్ తన తండ్రి వద్ద వ్యక్తం చేసారు అని ప్రచారం అయితే సాగుతోంది. నిజానికి చంద్రబాబు పవన్ పక్కన ఉంటే బిగ్ ఫిగర్ గా బాబు కనిపిస్తారు. ఆయన స్టేచర్ అలాంటిది. ఆయన అలా తన లీడర్ షిప్ ని బలంగా చాటుకోగలరు. అదే లోకేష్ పక్కకు వచ్చేసరికి మాత్రం తగ్గినట్లుగానే కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఇది నిజంగా లోకేష్ మనో వేదన మాత్రమే కాదు టీడీపీలోనూ అదే విధంగా చర్చ సాగుతోంది అని అంటున్నారు.

ఏ మాత్రం క్యాడర్ లేని జనసేనను పొత్తు పేరుతో తెచ్చిపెట్టుకుని పెంచి పోషిస్తున్నామా రేపటి రోజుకు ఏపీ రాజకీయలలో కొత్త ప్రత్యర్ధిని తాముగా తయారు చేస్తున్నామా అన్న బెంగలు కలవరాలు టీడీపీ నిండా ఉన్నాయట. నిజంగా టీడీపీకి ఇది ఇబ్బందికరమైన సన్నివేశమే. కానీ తట్టుకోక తప్పదనే అంటున్నారు.

బహుశా చంద్రబాబు కూడా చినబాబుకు ఇదే సలహా ఇచ్చి ఉంటారని అంటున్నారు. ఒక్క మాట అయితే చెప్పుకోవాలి. చంద్రబాబు జైలులో ఉండి లోకేష్ టీడీపీ పగ్గాలు అందుకుంటే పక్కన పవన్ మాత్రమే బిగ్ షాట్ గా కనిపించడం ఖాయమని అంటున్నారు. ఈ సమీకరణలు కొత్త సన్నివేశాలు టీడీపీని ఏ తీరం చేరుస్తాయో అన్న డౌట్లు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News