ఎన్డీయేకు మెజారిటీ తగ్గితే బాబు చక్రం తిప్పుతారా ?

మరో వైపు బాబుకు ఎన్డీయే కన్వీనర్ పదవిని కూడా కట్టబెట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇక చంద్రబాబు ఉన్న కూటమికి మెజారిటీ సాధించడం కష్టసాధ్యం కాబోదని కూడా జాతీయ స్థాయిలోనూ చర్చ సాగుతోంది.

Update: 2024-05-26 04:05 GMT

దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నాలుగు వందల సీట్లు ఎన్డీయేకు ఖాయమంటూ రంగంలోకి దిగిన బీజేపీ నేతలు ప్రచారం చివరికి వచ్చేసరికి మాత్రం ఆ మాట మాట్లాడటం తగ్గించారు. మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఇండియా కూటమి గెలవదు అని జోస్యం చెబుతున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఈసారి హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే అటు ఎన్డీయే 250 నంబర్ దగ్గర ఇటు ఇండియా కూటమి 200 నంబర్ దగ్గర ఆగిపోతాయని అంటున్నారు. అలా జరిగితే ఏ వైపు మొగ్గకుండా ఉన్న వంద మందికి పైగా సీట్లు ఉన్న పార్టీల మద్దతు కీలకం అవుతుంది. అలా చూస్తే ఉత్తరాదిన బీఎస్సీ, తూర్పున ఒడిషా బిజూ జనతాదళ్, ఏపీలో వైసీపీ, తెలంగాణాలో బీఆర్ఎస్ వంటి పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. వీటితో పాటు ఉత్తరాదిన ఏ కూటమిలోనూ చేరని చిన్న పార్టీలు కూడా మరికొన్ని ఉన్నాయని చెబుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఎన్డీయే కూటమి మెజారిటీకి పాతిక సీట్లు తక్కువలో ఉంటే అపుడు చంద్రబాబు రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. నిజానికి చంద్రబాబుని ఎన్డీయే కూటమిలోకి తిరిగి తీసుకోవడం వెనక బీజేపీ పెద్దల దూర దృష్టి కూడా ఉందని అంటున్నారు. బాబు ఇప్పటికి పాతికేళ్ల క్రితమే కేంద్రంలో కూటములు కట్టడంలో స్పెషలిస్ట్ గా పేరు గడించారు.

ఆయన యునైటెడ్ ఫ్రండ్ సృష్టికర్తగా ఉన్నారు. అలాగే ఆయనకు దేశంలోని అనేక జాతీయ పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బాబు కనుక రంగంలోకి దిగితే తటస్థ పార్టీల ఎంపీలను ఈ వైపునకు తీసుకుని వస్తారు అని అంటున్నారు. అది ఆయా పార్టీల అధినాయకత్వాలతో సంబంధం లేకుండా ఫిరాయించేలా కూడా జరగవచ్చు అని అంటున్నారు.

మరో వైపు ఇండియా కూటమి నుంచి కూడా కొన్ని పార్టీలను ఈ వైపు గా చేర్చేందుకు బాబుకు శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని అంటున్నారు. బాబు మాట వినేందుకు చాలా పార్టీలు కూడా సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. అంటే చాలా కీలకమైన ఘట్టం ఢిల్లీలో కనుక చోటు చేసుకునే వేళ బాబు అతి ముఖ్య పాత్ర పోషించ బోతున్నారు అని అంటున్నారు.

మరో వైపు బాబుకు ఎన్డీయే కన్వీనర్ పదవిని కూడా కట్టబెట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇక చంద్రబాబు ఉన్న కూటమికి మెజారిటీ సాధించడం కష్టసాధ్యం కాబోదని కూడా జాతీయ స్థాయిలోనూ చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈసారి ఎన్డీయేకు మెజారిటీ రాకపోతే బాబుదే అసలైన పాత్ర అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News