సొంత పార్టీ నేతనే.. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై కొత్త డౌట్లు

అధ్యక్ష స్థానంపై గురి పెట్టిన భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీ తాజాగా ట్రంప్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-21 09:04 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అంతకంతకూ రాజుకుంటోంది. ఎన్నికల బరికి ముందు.. సొంత పార్టీ నేతలతో పోటీ పడి.. వారిని ఓడించిన తర్వాతనే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తారన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు పోటీ పడిన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిపాలు కావటం తెలిసిందే. అయినప్పటికీ పట్టువిడవని డొనాల్డ్ ట్రంప్.. తాజాగా జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన లక్ ను మరోసారి చెక్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ఇంతకు ముందే షురూ చేయటమే కాదు.. తాను గురి పెట్టిన విషయాన్ని తన సంచలన వ్యాఖ్యలతో స్పష్టం చేస్తున్నారు.

ట్రంప్ తో పోటీ పడుతున్న సొంత పార్టీ (రిపబ్లికన్) నేతలు సైతం తగ్గట్లేదు. ట్రంప్ తీరుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన విమర్శలు ఒక ఎత్తు.. అధ్యక్ష స్థానంపై గురి పెట్టిన భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీ తాజాగా ట్రంప్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మానసిక స్థితి బాగోలేదన్న ఆమె.. 2021 జనవరి ఆరున అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో ట్రంప్ తీవ్రంగా ఫెయిల్ అయ్యారన్నారు.

నిక్కీ హేలీ వ్యాఖ్యలకు ఒక రోజు ముందు మాట్లాడిన ట్రంప్.. నిక్కీ హేలీ అసమర్థత గురించి.. క్యాపిటల్ భవనంపై దాడిని అడ్డుకోవటంలో ఆమె ఫెయిల్ అయ్యారంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఆమె.. "క్యాపిటల్ భవనం దాడి ఘటనకు సంబంధించి బాధ్యతను పొరపాటున తనకు అపాదిస్తున్నారన్న ఆమె.. 'ట్రంప్ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోంది. నేను ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్ర రాజ్య అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా?" అంటూ నిక్కీ హేలీ సంధించిన సందేహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News