క్రిప్టోనూ వదలని కిమ్ హ్యాకర్లు..రూ.11 వేలకోట్ల దోపిడీ
దోచేసి.. ప్యాంగ్ యాంగ్ కు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్. క్రిప్టోలో దోచేసిన సొమ్మును ఇక్కడకు చేరుస్తున్నారట. ఈ మొత్తం 1.3 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్ల పైగా) అని చైనాలసిస్ తెలిపింది.
ఉత్తర కొరియా.. ఈ మాట ఎక్కడైనా సంచలనమే.. తాజాగా ఈ దేశ సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్ లో యుద్ధం చేస్తున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుండగా,వారిని గుర్తుపట్టకుండా రష్యా ముఖాలను కాల్చేస్తోంది. ఇక ఉత్తర కొరియా అధినేత కిమ్ గురించి చెప్పేదేముంది..? ఆయన ఓ నియంత. తరచూ క్షిపణులు, ఆయుధాల పరీక్షలు, సైనిక విన్యాసాలకు దిగుతుంటారు. తాజాగా ఉత్తర కొరియా గురించి ఓ కీలక విషయం బయటకు వచ్చింది.
నెలకు 1,000 కోట్లు..
రూ.వెయ్యి కోట్లు.. ఇదీ ఏడాదిలో ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు దోచేసిన క్రిప్టో కరెన్సీ. డాలర్లలో చెప్పాలంటే ఇది మొత్తం 2.2 బిలియన్ డాలర్లు. రూ.18 వేల కోట్లకు పైగానే. ఇందులో సగానికి పైగా ఉత్తర కొరియా వారే మాయం చేశారని చైనాలసిస్ అనే సంస్థ చెబుతోంది.
దోచేసి.. ప్యాంగ్ యాంగ్ కు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్. క్రిప్టోలో దోచేసిన సొమ్మును ఇక్కడకు చేరుస్తున్నారట. ఈ మొత్తం 1.3 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్ల పైగా) అని చైనాలసిస్ తెలిపింది. రిమోట్ ఐటీ ఉద్యోగుల ముసుగులో క్రిప్టో, ఇతర టెక్నాలజీ సంస్థల్లోకి చొరబడి దోచుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాదే అధికం..
గత ఏడాదితో పోలిస్తే క్రిప్టోల చోరీ 21 శాతం పెరిగిందట. అయితే, అత్యంత ఎక్కువగా చోరీ మాత్రం 2021-22 మధ్యనట. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువేనట.
క్రిప్టో ప్లాట్‌ఫామ్ లపై వినియోగదారులు వాడే ప్రైవేటు ‘కీ’లోని లోపాలతోనే దోపిడీ జరుగుతోందని తేలింది. కేంద్రీకృత ఎక్స్‌ఛేంజీలు భారీ నిధులను నిర్వహిస్తుండడంతో ప్రైవేట్ ‘కీ’లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
జపాన్ ఎక్స్‌ఛేంజీ బీఎంఎం బిట్ కాయిన్ లో జరిగిన 300 మిలియన్ డాలర్ల విలువైన హ్యాకింగ్ అత్యంత తీవ్రమైనది. భారత్ లోని క్రిప్టో ఎక్స్‌ఛేంజీలో 253 మిలియన్ డాలర్ల విలువైన సొమ్ము దారి మళ్లింది.
అమెరికాలోని 14 మంది ఉత్తరకొరియా వాసులు అమెరికా కంపెనీల నుంచి నిధులను ప్యాంగ్ యాంగ్‌లో ఆయుధ కొనుగోళ్లకు మళ్లించారు.ట్రంప్ రాకతో అమెరికాలో క్రిప్టో అనుకూల చట్టాలు వస్తాయని అంటున్నారు. భవిష్యత్తులో బిట్ కాయిన్ 1,20,000 డాలర్లకు కూడా చేరుతుందని భావిస్తున్నారు.