రుక్మిణి కోసం 32మందిని గెంటేశారు... పవన్ పై పద్మావతి ఫైర్!

ఈ సందర్భంగా పవన్ పై ఫైరవ్వడమే కాకుండా టీడీపీతో పొత్తు విషయంలో జనసైనికుల మనోభావాలను ఆవిష్కరిస్తున్నట్లుగా పసుపులేటి పద్మావతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-11-22 12:29 GMT

గతకొన్ని రోజులుగా జనసేనలోని కీలక నేతలు అంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు! టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం ఇప్పటికే పలువురు కీలక నేతలు జనసేనను వీడగా... వీడే క్రమంలో పవన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మరోపక్క మనోహర్ ని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఇటీవల వీరితోపాటు కోట రుక్మిణి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తాజాగా జనసేన మహిళా నేత పద్మావతి మూగ్గురినీ కలిపి వాయించారు!

అవును... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ రాజ‌కీయ విధానాలపై తీవ్ర అసంతృప్తితో జ‌న‌సేన‌కు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర క్రమ‌శిక్షణ క‌మిటీ వైస్ చైర్‌ ప‌ర్సన్ ప‌సుపులేటి ప‌ద్మావ‌తి తాజాగా వైసీపీలో చేరారు. ఆమె త‌న‌యుడు సందీప్ రాయ‌ల్ తో కలిసి బుధ‌వారం ప్రభుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు పద్మావతి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, మనోహర్, కోట రుక్మిణి లపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ పై ఫైరవ్వడమే కాకుండా టీడీపీతో పొత్తు విషయంలో జనసైనికుల మనోభావాలను ఆవిష్కరిస్తున్నట్లుగా పసుపులేటి పద్మావతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తల్లిదండ్రులు ఎవరూ మీ మీ పిల్లలను పవన్ కల్యాణ్ వెంట పంపొద్దని.. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ప్రయోజనాలే మఖ్యమని.. నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడని అన్నారు!

ఇదే సమయంలో... చంద్రబాబుతో పని చేసేందుకు ఏ జనసేన కార్యకర్త సిద్ధంగా లేడని స్పష్టం చేసిన పద్మావతి... జన సైనికులను తెలుగుదేశం నేతలు కూలీలుగా చూస్తూ అవమానిస్తున్నారని.. రాయలసీమలో జనసేన పార్టీలో బలిజలను రాజకీయంగా తొక్కేస్తున్నారని.. పార్టీలో క్రియాశీలకంగా ఉండే మహిళలను ఎదగనీయడం లేదని.. మహిళలు ఎదగడం మనోహర్ కి ఇష్టం లేనట్లుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో... అందరినీ ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ మొదలుపెట్టిన పద్మావతి... రుక్మిణి కోసం మమ్మల్ని ఎందుకు గెంటేశారు? కోట రుక్మిణి అంటే మీకు ఎందుకు అంత భయం? పార్టీని నమ్ముకుని పని చేస్తున్న 32మందిని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రుక్మిణి కోసం గెంటేయడం న్యాయమేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

దీంతో అటు జనసేన పార్టీ నేతలతోపాటు, ఇటు కార్యకర్తలలోనూ ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇప్పటివరకూ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారంతా క్రమం తప్పకుండా ఒకటే టైపు విమర్శలు చేస్తుండటంతో... పార్టీలో సమస్య స్పష్టంగా ఉందని.. అది పవన్ కల్యానే అని అంటున్నారు పరిశీలకులు! మరి ఈ కామెంట్లపై జనసేన నేతలు అసలు స్పందిస్తరా లేదా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News