పవన్ ప్లాన్ బీ ని రెడీ చేస్తున్నారా ?

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు.;

Update: 2024-08-12 03:52 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు. ఆయనతో పాటు అభిమానులు కోరుకునే ముఖ్యమంత్రి పీఠానికి కడు సమీపానికి వచ్చారు. పవన్ ని ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్న అభిమాన జనం ఆయన సీఎం పోస్టుకు అడుగు దూరంలో ఉన్నారు అని అంటున్నారు.

నిజనే ఉప తీసేస్తే ఉండేది ముఖ్యమంత్రే. ఈ రెండింటికీ మధ్య రెండు అక్షరాలే తేడా. కానీ ఆ అడుగు దూరంలోనే యోజనాల రాజకీయ ప్రయాణం కూడా ఉంది. జనసేనకు ఈసారి 21కి 21 సీట్లూ దక్కాయి. అసెంబ్లీలో అధికారం దక్కాలీ అంటే సింపుల్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నది 88 సీట్లు అంటే పవన్ సీఎం పదవికి ఎంత దూరం లో ఉన్నారు అంటే అది అంకెల సాక్షిగా చూస్తే 67 సీట్లు అని చెప్పాలి.

అంటే ఇప్పుడు దక్కించుకున్న సీట్లకు మరో మూడింతలకు పైగా సీట్లు కలపాలి అన్న మాట. రాజకీయం అంతా లెక్కలతోనే ఆధారపడి ఉంటుంది. అక్కడ అడుగులు అంటే అర్థాలు వేరుగా ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ హోదాలో ప్రభుత్వాన్ని కదిలించగలుగుతున్నారా అంటే పరిమితంగానే అని అంటున్నారు.

ఉప ముఖ్యమంత్రి అయినా పూర్తి అధికారాలు ముఖ్యమంత్రి వద్దనే ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం ఆయన మంత్రిగానే ఉంటారు. సో పవన్ అభిమానుల అంచనాలు నిజం కావాలీ అంటే 2029 నాటికి జనసేన బాగా విస్తరించాలి. ఇపుడు ఉన్న 21 సీట్లతో పాటు మిగిలిన 154 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బలం పెంచుకోవాలి.

రాజకీయాల్లో ఎపుడూ ఒకేలా రోజులు ఉండవు. అక్కడ నమ్మకాల కంటే వ్యూహాలనే అంతా ముందు పెట్టుకుని సాగుతారు. అవకాశం ఎవరిది అయితే వారిదే పై చేయి. ఆ అవకాశం దక్కాలీ అంటే దానికి శోధించి సాధించాల్సిందే. జనసేన ఇపుడు ఆ విధంగా ఆలోచిస్తోందా అంటే అవును అనే అంటున్నారు.

అధికారం చేపట్టిన తరువాత జనసేన చేసిన పని ఏంటి అంటే పార్టీని పటిష్టంపరచుకోవడం. ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదుని జనసేన చేపట్టింది. ఒక వైపు క్యాడర్ హుషార్ గా ఉంది. లీడర్లు ఊపు మీద ఉన్నారు. దాంతో బాగానే సభ్యత్వం జరిగింది. అన్ని చోట్లా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సభ్యత్వ నమోదు గడువుని కూడా పెంచుకుంటూ పోయారు అలా అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువే సాధించామని అంటున్నారు. ఏపీలో పది లక్షలకు పైగా జనసేన సభ్యత్వం నమోదు అయింది. ఇపుడు ఒక కొత్త పార్టీగా జనసేనకు ఈ నంబర్ చూస్తే బిగ్ ఫిగర్ అనే చెప్పాలి.

దీని తరువాత ఎక్కడికక్కడ జిల్లా కమిటీలు మండల గ్రామ స్థాయి కమిటీలను వేస్తారని అంటున్నారు. అలా బూత్ లెవెల్ దాకా గ్రాస్ రూట్ ని పట్టుకుని జనసేన విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక పవన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. దాంతో గ్రామ స్థాయిలో సర్పంచుకు అత్యధిక సంఖ్యలో జనసేనలోనే చేరుతున్నారు. గత మూడేళ్ళుగా నిధులు లేక ఎండిపోయిన వారికి ఇపుడు జనసేన అండగా ఉంది. అందుకే ఆ పార్టీలో చేరితేనే బెటర్ అని వారు తలపోస్తున్నారు.

దీని తరువాత చూస్తే 2026లో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరుగుతాయి. అపుడు కూడా జనసేన తన బలాన్ని చూపించి ఎక్కువ సీట్లే తీసుకుంటుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జనసేన బలోపేతం కోసం ఒక పవర్ ఫుల్ మీడియా వాయిస్ గా ఉండాలని నాగబాబు ద్వారా కొత్త చానల్ పెట్టిస్తున్నారు అని అంటున్నారు.

అంటే రానున్న కాలంలో జనసేన మీడియా పరంగా కూడా బలంగా ఉండేలా పక్కా ప్లాన్ సిద్ధం అయింది అన్న మాట. 2029లో కూటమితో కలసి పోటీ చేయవచ్చు, లేదా బీజేపీతో కలసి బరిలోకి దిగవచ్చు. లేదా వేరే ఆప్షన్లు కూడా సిద్ధంగా ఉంటాయి. ఏది ఏమైనా జనసేన సంస్థాగతంగా బలంగా ఉంటేనే ఏ రాజకీయ వ్యూహం అయినా పారేది అని అంటున్నారు. దాని కోసమే ప్లాన్ బీని పవన్ అమలు చేస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News