పొత్తులు డిసైడ్ చేసేది పవనేనా ?

ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందన్న విషయంలో క్లారిటి ఉంది

Update: 2023-10-10 15:30 GMT

ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందన్న విషయంలో క్లారిటి ఉంది. ప్రతిపక్షాల్లోనే క్లారిటి లోపించింది. ప్రతిపక్షాల్లో ఎన్నిపార్టీలు కలుస్తాయి ? ఎన్నిపార్టీలు విడిగా పోటీచేస్తాయనే విషయం అయోమయంగా తయారైంది. ఈ మొత్తంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపైనే పొత్తులన్నీ ఆధారపడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన, బీజేపీ ఇపుడు మిత్రపక్షాలుగా ఉన్నాయి. తమతో చంద్రబాబునాయుడును కూడా కలుపుకోవాలన్నది పవన్ ఆలోచన.

అయితే అందుకు బీజేపీ అంగీకరించటంలేదు. కాబట్టి పవన్ ఏమిచేస్తారన్నది కీలకమైంది. బీజేపీని పవన్ వదిలేస్తే టీడీపీతో జట్టుకట్టచ్చు. కానీ ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన పవన్ బీజేపీ విషయంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కృష్ణాజిల్లా వారాహియాత్రలో ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన పవన్ 24 గంటల్లో ఏమైందో ఏమో తాను ఎన్డీయేలోనే ఉన్నట్లు మాట మార్చారు. అంటే ప్రతిపక్షాల్లో పొత్తులు ప్రధానంగా పవన్ వైఖరి మీదే ఆధారపడుందని అర్ధమవుతోంది.

పవన్ గనుక బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే టీడీపీతో పొత్తు సాఫీగా మొదలవుతుంది. అప్పుడు వామపక్షాలు కూడా చేతులు కలపటానికి రెడీగా ఉన్నాయి. అవకాశం ఉంటే కాంగ్రెస్ కూడా చేరుతుందేమో చూడాలి. అప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటవుతుందేమో. ఒకవేళ పవన్ బీజేపీతోనే కంటిన్యు అయ్యేట్లయితే బీజేపీ-జనసేన, టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఒకటయ్యే అవకాశముంది. బీజేపీని వదిలేసినపుడు కాంగ్రెస్ తో కలవటం పవన్ కు ఇష్టంలేకపోతే టీడీపీ, వామపక్షాలు, జనసేన ఒకటయ్యే ఛాన్స్ కూడా ఉంది.

పైన చెప్పినట్లుగా ప్రతిపక్షాల్లోని రెండు మూడు కాంబినేషన్లు సెట్ అవ్వటం అన్నది పవన్ నిర్ణయంపైనే ఆధారపడుంది. దీన్నిబట్టే పొత్తులు డిసైడ్ చేసేది పవనే అని అర్ధమవుతోంది. అయితే ఏ కాంబినేషన్తో ఎన్నికలకు వెళ్ళాలనే విషయంలో పవనే ఫుల్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకవైపు టీడీపీతో పొత్తన్నారు, సమన్వయ కమిటి అనికూడా ప్రకటించేశారు. అయితే బీజేపీని వదల్లేకుండా ఉన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నంతవరకు ఇతరులతో పవన్ చేతులు కలిపే అవకాశంలేదన్నది వాస్తవం. చివరకు పవన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News