బాబు, పవన్ లను ఓ రేంజ్ లో టీజ్ చేసిన కేఏ పాల్.. వైరల్ వీడియో
కేఏ పాల్ మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావ్" అని ఆరోపించారు. ఇటీవల జగన్ పై పవన్ చేసిన ఆరోపణలపై కూడా కేఏ పాల్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారిన పేరు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కేఏ పాల్ ఓ రేంజ్‌లో పవన్‌ను ఇమిటేట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
- పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు
కేఏ పాల్ మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావ్" అని ఆరోపించారు. ఇటీవల జగన్ పై పవన్ చేసిన ఆరోపణలపై కూడా కేఏ పాల్ స్పందించారు. "రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నారని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు. కానీ ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణమైన రేట్లతో అమ్ముతున్నారు" అంటూ పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
-30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్!
కేఏ పాల్ తాజాగా పవన్ పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరో సంచలన ఆరోపణ చేశారు. "మా ప్రభుత్వం రాగానే 30 వేల మంది మిస్సింగ్ అయిన అమ్మాయిలను వెతికి తీసుకువస్తామని పవన్ అన్నాడు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిల గురించే అసలు మాట్లాడటం మానేశాడు," అంటూ ఆయన పవన్ నిబద్ధతను ప్రశ్నించారు.
-చంద్రబాబుపై కూడా విమర్శలు
కేవలం పవన్‌కే కాకుండా చంద్రబాబుపై కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. "ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
కేఏ పాల్ వ్యాఖ్యలతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇది రాజకీయ వర్గాల్లో రచ్చ రేపుతుండగా, పవన్ అభిమానులు మాత్రం కేఏ పాల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం కేఏ పాల్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, కేఏ పాల్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఆయన భవిష్యత్తులో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారా? లేక ఈ విమర్శలకు ఏదైనా రాజకీయ నాయకుల నుండి ప్రతిస్పందన వస్తుందా? అనేది చూడాలి.