పోసానికి అనారోగ్యం ఓ నాటకం... సీఐ సంచలన వ్యాఖ్యలు!

దీంతో... మార్చి 12వ తేదీ వరకూ పోసాని కృష్ణమురళి రిమాండ్ లో ఉండనున్నారు.

Update: 2025-03-01 13:41 GMT

సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో... మార్చి 12వ తేదీ వరకూ పోసాని కృష్ణమురళి రిమాండ్ లో ఉండనున్నారు.

ఈ సమయంలో పోసాని కృష్ణమురళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. వెంటనే స్పందించిన రాజంపేట సబ్ జైలు సిబ్బంది ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో వైద్యులు పోసానికి పరీక్షలు నిర్వహించారని అంటున్నారు. ఈ సందర్భంగా సీఐ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న సినీనటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పడంతో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కడుపు నొప్పి అని పోసాని నాటకం ఆడారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన సీఐ వెంకటేశ్వర్లు... పోసానికి ఈసీజీ, రక్తపరీక్ష సహా అన్ని పరీక్షలూ చేయించామని.. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారని.. కడుపు నొప్పి అని ఆయన నాటకం ఆడారని సీఐ తెలిపారు. దీంతో.. ఆయనను తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

Full View
Tags:    

Similar News