ట్రెండింగ్ లో మగాళ్ల కష్టాలు.. నెట్టింట సంచలన పోస్టులు!

ఇందులో భాగంగా... దయచేసి, మగాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా గుర్తించి వారి కోసం ఎవరైనా మాట్లాడండి.. మగాళ్లు ఒంటరైపోతున్నారు.. అని సమాజాన్ని కోరాడు.;

Update: 2025-03-01 15:30 GMT

ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సుభాష్.. తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ డెత్ నోట్ రాసి, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇదే సమయంలో... ప్రముఖ సింగర్, ర్యాపర్, ఒడిశాకు చెందిన అభినవ్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమని అభినవ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతకంటే ముందు కర్ణాటకలో కానిస్టేబుల్ తిప్పన్న, రాజస్థాన్ లో అజయ్, ఢిల్లీలో పునీత్ ఇలా... చెప్పుకుంటూ పోతే భార్యల కారణంగా బలవన్మరణం చేసుకున్న బాధితులు ఎందరో! ఈ సమయంలో తాజాగా ముంబైలోని ప్రముఖ ఐటీ కెంపనీలో మేనేజర్ గా పనిచేస్తున్న ఆగ్రావాసి మానవ్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తన మరణానికి భార్య నికితా శర్మ కారణమని పేర్కొంటూ ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మానవ్ రికార్డ్ చేసిన వీడియో తాజాగా వెలుగుచూడటంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వీడియోలో తన తల్లితండ్రులను క్షమాపణ కోరిన మానవ్.. అనంతరం మగాళ్ల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, సమాజాన్ని రిక్వస్ట్ చేశాడు.

ఇందులో భాగంగా... దయచేసి, మగాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా గుర్తించి వారి కోసం ఎవరైనా మాట్లాడండి.. మగాళ్లు ఒంటరైపోతున్నారు.. అని సమాజాన్ని కోరాడు. తన భార్యకు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. తనను విపరీతంగా వేదిస్తోందని తెలిపాడు! ఈ సమయంలో.. నెట్టింట ఈ విషయం వైరల్ గా మరింది.

ఈ సందర్భంగా... # MenToo ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ హాష్ ట్యాగ్ తో తమనూ భార్యలు వేధిస్తున్నారంటూ అనేక మంది భర్తలు ఆన్ లైన్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. తమ కష్టాలను పంచుకుంటున్నారు! ఇదే సమయంలో పలువురు కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారు! దీంతో... ఇప్పుడు నెట్టింట # MenToo సంచలనంగా మారింది

Tags:    

Similar News