సర్కార్ బిగ్ షాక్... ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్!
ఇందులో భాగంగా.. కొన్ని వాహనాలకు ఇకపై డీజిల్, పెట్రోల్ బంద్ అని స్పష్టం చేసింది.
వాహనాలు ముందుకు సాగాలంటే అందులో ఇందనం ఉండాలనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో డీజిల్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ వాహనాల్లో పెట్రోల్ నింపుకుని వాహదారులు రయ్ రయ్ మంటూ వెళ్తుంటారు. ఈ సమయంలో సర్కార్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. కొన్ని వాహనాలకు ఇకపై డీజిల్, పెట్రోల్ బంద్ అని స్పష్టం చేసింది.
అవును... తాజాగా ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... కొన్ని సెలక్టివ్ వాహనాలకు మార్చి 31 తర్వాత పెట్రోల్, డీజిల్ ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు స్పందించిన పర్యావరణ శాఖ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా... 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత నగరంలోని పెట్రోల్ బంకుల్లో ఇందన సరఫర నిలిపివేస్తామని ప్రకటించారు.
అంటే... ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ లభించదన్నమాట. తాజాగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం... నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో... కాలుష్యాన్ని అరికట్టడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని చెబుతున్నారు.
ఇదే సమయంలో.. 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను గుర్తించే గాడ్జెట్ లను పెట్రోల్ పంపుల వద్ద ఏర్పాటు చేస్తున్నామని.. ఆ గాడ్జెట్ తో గురించిన వెహికల్స్ కు ఏప్రిల్ 1 నుంచి ఇంధనం అందించబడదని అన్నారు. ఈ తాజా నిర్ణయం గురించి ఢిల్లీ సర్కార్.. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుందని సిర్సా స్పష్టం చేశారు.
అంతేకాకుండా... వాయు కాలుష్య స్థాయిలను అరికట్టడానికి రాజధానిలోని కొన్ని ఎత్తైన భవనాలను, వాణిజ్య సముదాయాలు, హోటల్స్ వద్ద యాంటీ స్మోక్ గన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. 2025 నాటికి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులతో రీప్లేస్ చేస్తామని అన్నారు!
కాగా... గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ప్రమాధకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత ప్రమాధకర స్థాయికి చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ప్రజల ఊపిరితిత్తులు కచ్చితంగా ఎంతో కొంత నాశనం అయ్యి ఉంటాయంటూ పరిశోధకులు తెలిపారు!
మరోపక్క తాజాగా ఏక్యూఐ.ఇన్ ప్రకటించిన నివేదికలో.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించగా.. అత్యంత కలుషిత నగరాల జాబితాలో దేశ రాజధాని న్యూఢిల్లీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సర్కార్ ఈ తరహా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు.