జగన్ పవన్ : ఇద్దరిదీ ఒకే రూట్ !
ఏపీలో చూస్తే రాజకీయం వేడి అలాగే ఉంది. క్యాడర్ అయితే గ్రౌండ్ లెవెల్ లో దూకుడు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసాయి కాక అలాగే ఉంది
ఏపీలో చూస్తే రాజకీయం వేడి అలాగే ఉంది. క్యాడర్ అయితే గ్రౌండ్ లెవెల్ లో దూకుడు చేస్తున్నారు. ఎన్నికలు ముగిసాయి కాక అలాగే ఉంది. కానీ ఈ సమయంలో రిలాక్స్ అయ్యేందుకు అధినేతలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అయితే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌కు పయనం అవుతున్నారు.
ఆయన ఈ నెల 17 నుంచి ఏకంగా పదిహేను రోజుల పాటు దేశంలో ఉండరు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఆయన తిరిగి జూన్ 1 న ఇండియాకు ఆంధ్రాకు వస్తారని అంటున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విదేశీ టూర్ కి రెడీ అవుతున్నారు. ఆయన సైతం రిలాక్స్ అవడానికి ఎన్నికల వేడిని తగ్గించుకోవడానికి చూస్తున్నారు. దాంతో దాదాపు నెల రోజుల పాటు టూర్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ అయితే జూన్ నెల మధ్యలోనే తిరిగి వస్తారు అని అంటున్నారు. కౌంటింగ్ వేళ ఆయన ఏపీలో ఉంటారా అన్నది కూడా తెలియడం లేదు. ఆయన లాంగ్ టూర్ అయితే మాత్రం కౌంటింగ్ పూర్తి అయిన తరువాతనే వస్తారా అన్నది కూడా తెలియడం లేదు. మొత్తానికి చూస్తే జగన్ పవన్ ఇద్దరూ విదేశీ టూర్లకు రెడీ అయిపోయారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా టూర్లు పెట్టుకున్నారా అన్న దాని మీద చర్చ సాగుతోంది. చంద్రబాబు అయితే దేశంలోనే ఎక్కడో ఒక చోట కూలింగ్ స్పాట్ చూసుకుని ఫ్యామిలీ ట్రిప్ వేస్తారని అంటున్నారు. మొత్తానికి కౌంటింగ్ కి మూడు వారాలు టైం ఉండడంతో నేతలు అంతా విశ్రాంతి కోసం ఏపీని దాటి వెళ్ళాలని చూస్తున్నారు.
వీరిలో మంత్రులు వైసీపీ సీనియర్ నేతలతో పాటు టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఇతర నాయకులు కూడా ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద ఏపీలో హీట్ మాత్రం అలాగే ఉంది. ఇది కొద్ది రోజుల తరువాత అయినా తగ్గుతుందా లేక కౌంటింగ్ వరకూ అలాగే కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.