పవన్ కళ్యాణ్ కి ఆ వ్యాధి ఉందా...?

ఆవేశంతో కూడిన ఆలోచనలు ఎపుడూ రాజకీయాలకు అవసరం. కానీ ఓన్లీ ఆవేశం అంటే అది బూమరాంగ్ అవుతుంది అన్నది చరిత్ర చెప్పింది

Update: 2023-09-18 04:08 GMT

పవర్ స్టార్ గా వెండి తెర మీద సత్తా చాటుతున్న హీరో పవన్ కళ్యాణ్. ఇక రాజకీయాల్లో ఆయన జనసేనానిగా ఉన్నారు. దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని పేరు. ఆవేశం ఆయన రాజకీయానికి ఇంధనం. పవన్ మాటలూ బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు ఆయన యాక్షన్ రియాక్షన్ అన్నీ ఆవేశంతోనే ఉంటాయి. ఆయన వ్యూహాలు సైతం ఆవేశంతోనే నిండిపోతాయని అంటారు.

ఆవేశంతో కూడిన ఆలోచనలు ఎపుడూ రాజకీయాలకు అవసరం. కానీ ఓన్లీ ఆవేశం అంటే అది బూమరాంగ్ అవుతుంది అన్నది చరిత్ర చెప్పింది. అయితే పవన్ కి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఆయన పాలిటిక్స్ కి ఆవేశం అరోప్రాణం గా ఉంది. కానీ ఆయన ఆలోచనలు కూడా సూపర్ హిట్ అవుతాయని జనసైనికులు నమ్ముతారు.

ఆవేశం అన్నది అవసరం, అవినీతి సమాజాన్ని రాజకీయాలను కడిగిపారేయడానికి అని వారు అంటారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆవేశాలు అన్నీ కూడా వైసీపీకి ఎపుడూ టార్గెట్ గానే ఉంటాయి. ఆయన ఏమి చేసినా విమర్శిస్తూ ఉంటారు. ఇక పవన్ మంగళగిరిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జగన్ మీద దారుణమైన కామెంట్స్ చేశారు.

వాటి మీద ఒక్కో వైసీపీ మంత్రి తమదైన శైలిలో రియాక్ట్ అవుతునారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని కడిగిపారేశారు. ఆయన రాజకీయాలకు అసలు పనికిరాని వ్యక్తి అని విమర్శించారు. జగన్ని పట్టుకుని మానసిరోగి అని పవన్ చేసిన కామెంట్స్ ని అంతే స్థాయిలో అంబటి రాంబాబు తిప్పికొట్టారు.

నిజానికి అలాంటి రోగాలు జబ్బులు అన్నీ పవన్ కే ఉన్నాయని అన్నారు. అంబటి రాంబాబు పవన్ గురించి చెబుతూ మల్టిపుల్ పర్సనాల్టీ డిజాస్టర్ అనే వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి వల్లనే పవన్ లో నిలకడ లోపించిందని, ఆయన ఏమి చేస్తున్నారో కూడా ఆయనకు అర్థం కావడం లేదని అన్నారు.

పవన్ కోసం జనసేన లో వారు పనిచేస్తూంటే ఆయన చంద్రబాబు కోసం పనిచేయడం కంటే విడ్డూరం దారుణం లేదని అన్నారు. జగన్ని పవన్ వ్యక్తిగతంగా దాడి చేయడం వెనక ఆయన ఆక్రోశం చేతగానితనమే కనిపిస్తున్నాయని అన్నారు. సత్తా లేకపోతేనే ఇలాంటి మాటలు అంటారని కూడా సెటైర్లు వేశారు. నాదెండ్ల మనోహర్ ని నమ్ముకుని సముద్రాన్ని ఈదాలని పవన్ చూస్తున్నారు, దాని పరిణామాలు ఏంటో ఆయనకు తరువాత అర్ధం అవుతాయని కూడా అంబటి అంటున్నారు.

చంద్రబాబుకు సానుభూతి అని భ్రమలలో తమ్ముళ్ళు ఉన్నారని, అది అసలు ఎక్కడైనా ఉందా అని అంబటి ప్రశ్నించారు. ఆ మాటకు వస్తే బాబుని అరెస్ట్ చేసి సానుభూతిని ఆ పార్టీకి ఇప్పించేటంత తెలివి తక్కువగా తాము ఉంటామా అని అంబటి ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కలసి రావాలని వారిద్దరి ముసుగు తొలగాలి అని తాము గట్టిగా కోరుకుంటున్నామని అది ఈ రోజుతో తీరిందని అంబటి అనడం విశేషం.

మా లెక్కలు మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఆయన అన్నారు. ఇద్దరూ కలసికట్టుగా వస్తేనే ఓడించి పంపిస్తామని ఆయన అంటున్నారు. పార్టీని ప్రజలకు మోసం చేసిన పవన్ ని అలాగే అవినీతి చేసిన జైలుకెళ్ళిన బాబుని ఓడించడమే వైసీపీ టార్గెట్ అన్నారు. మొత్తానికి అంబటి పక్కా లెక్కలు వైసీపీకి ఉన్నాయని చెబుతున్నారు. ఆ లెక్కలు ఏంటి అన్నవి రానున్న ఎన్నికలలో చూడాల్సి ఉంది. అంతవరకు వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News