జనసేన కీలక మీటింగ్ దిశగా పవన్...!

పవన్ ఇటీవల వైరల్ ఫీవర్ కి గురి అయ్యారు. దాంతో మంగళగిరిలో పవన్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ఒకటి జరగాల్సింది వాయిదా పడింది

Update: 2023-10-17 10:54 GMT

జనసేన అధినేత సాధ్యమైనంత తొందరలో కీలకమైన పార్టీ మీటింగ్ ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో జనసేన ఏ విధంగా ముందుకు సాగాలన్న దాని మీద ఆయన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తారని తెలుసోంది.

పవన్ ఇటీవల వైరల్ ఫీవర్ కి గురి అయ్యారు. దాంతో మంగళగిరిలో పవన్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ఒకటి జరగాల్సింది వాయిదా పడింది. ఇపుడు కోలుకున్న పవన్ అందుబాటులో ఉన్న నేతలతో తాజాగా సమావేశం అయి వర్తమాన రాజకీయ పరిణామాలను చర్చించారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉందని పవన్ స్వయంగా ప్రకటించారు. దానికి అనుగుణంగా చంద్రబాబు పరోక్షంలో రెండు పార్టీల నేతలు కూర్చుని చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

దాని కంటే ముందు పార్టీకి చెందిన జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో త్వరలో పవన్ భేటీ అవుతారు అని అంటున్నారు. టీడీపీతో పొత్తు ప్రకటన వెంటనే మంగళగిరిలోని ఒక పార్టీ సమావేశాన్ని పవన్ నిర్వహించారు. నాడు పార్టీకి చెందిన కీలక నేతలతో పొత్తు అంశం గురించి చర్చించారు. ఎందుకు పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చిందో కూడా పవన్ తెలిపారు. ఇది అనివార్యం అని కూడా పవన్ వారికి గట్టిగా చెప్పారు.

ఇపుడు గ్రాస్ రూట్ లెవెల్ వరకూ ఉన్న పార్టీ నాయకలుతో అత్యంత కీలకమైన సమావేశమే నిర్వహించబోతున్నారు అని అంటున్నారు. ఈ మీటింగ్ ద్వారా టీడీపీ పొత్తు విషయంలో ఎవరికైనా ఇబ్బందులు అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో రెండు పార్టీలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ జనసేన పొత్తు తరువాత జనసేన వెంటనే నాదెండ్ల మనోహర్ నేయకత్వంలో ఒక కో ఆర్డినేషన్ కమిటీని ప్రకటించింది. రీసెంట్ గా యనమల అచ్చెన్నాయుడులతో పాటు మరి కొందరి సీనియర్లతో టీడీపీ కూడా కో ఆర్డినేషన్ కమిటీని నియమించింది. ఇక ఈ రెండు కమిటీలకు చెందిన మెంబర్స్ భేటీ అయి చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.

దాంతో కో ఆర్డినేషన్ కమిటీ అజెండాను పవన్ కూడా సెట్ చేస్తారు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన తగ్గకుండా ఉండేలా చూసుకుంటూనే పొత్తుని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా ఒక రూట్ మ్యాప్ ని కూడా రెడీ చేస్తారు అని అంటున్నారు. దాంతో చాలా తొందరలోనే టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మీటింగ్ తరువాతనే ఒక స్పష్టత వస్తుందని, పొత్తుల విషయంలో కూడా అడుగులు ముందుకు పడతాయని అంటున్నారు. బహుశా దసరా తరువాత రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమానికి కూడా రంగం సిద్ధం అవుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News