విశాఖలో బద్ధలు కానున్న పవన్ మౌనాగ్ని

పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి చేసే ప్రసంగాలు భూకంపం పుట్టిస్తాయి. ఆయన వారాహి ఎక్కితే చాలు రీ సౌండ్ చేస్తారు.

Update: 2023-08-10 02:45 GMT

పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి చేసే ప్రసంగాలు భూకంపం పుట్టిస్తాయి. ఆయన వారాహి ఎక్కితే చాలు రీ సౌండ్ చేస్తారు. అవేశానికి నిలువెత్తు ప్రతిరూపం అవుతారు. సవాళ్లు చేస్తారు. సంచలన ప్రకటనలు చేస్తారు. మొత్తానికి అందరినీ తన వైపునకు తిప్పుకుంటారు. వారాహి సభ ఉంటే దానికి కొద్ది రోజుల ముందు నుంచి పవన్ పెద్దగా మాట్లాడరు. ఆయన తన మౌనాన్ని అగ్నిలా రగిల్చి ఒక్కసారి సభలోనే బద్ధలు కొడతారు.

అది జ్వలించే తీరు ప్రకంపనలే పుట్టిస్తుంది. ఇపుడు కూడా విశాఖ సాగర తీరాన మూడవ విడత వారాహి యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. ఆయన జగదాంబ జంక్షన్ లో తొలి స్పీచ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పవన్ ఏమి మాట్లాడతారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మీడియా సమావేశాలు పెట్టిన జనసేన నాయకులు హింట్ కొంత ఇచ్చేశారు.

విశాఖలో భూ కబ్జాల నుంచి శాంతి భద్రతల లేని తీరుతో పాటు అనేక అంశాలు పవన్ టచ్ చేస్తారు అని అంటున్నారు. విశాఖ చూస్తే వైసీపీ టార్గెట్ చేసిన నగరం. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని సంకల్పించింది. అయితే విశాఖకు ఆ సిరి దక్కలేదు, వైసీపీ గురి మారలేదు, జగన్ మకాం విశాఖకు మార్చుకుంటున్న నేపధ్యంలో పవన్ ఆయన కంటే ముందే విశాఖ వస్తున్నారు.

పది రోజుల పాటు విశాఖలో కలియతిరగనున్నారు. రుషికొండ విద్వంశం గురించి మాట్లాడుతారని, విశాఖ అభివృద్ధి లేని తీరుని ఎండగడతారని అంటున్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ వర్సెస్ వైసీపీ గా ఏపీ పాలిటిక్స్ మారింది. దాని మీద మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ వారికి కౌంటర్ ఇచ్చారు. కానీ అసలు సేనాని అయిన పవన్ నుంచి ఏమీ అటాక్ రాలేదు.

ఇపుడు విశాఖ వేదికగా పవన్ తన అన్న గురించి మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుని ఎండగడతారు అని అంటున్నారు అలాగే బ్రో సినిమా తరువాత అంబటి రాంబాబు వైసీపీ నేతలు అంతా పవన్ మీద విమర్శలు చేశారు. దానికి పవన్ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. ఇపుడు ఆ లోటూ తీర్చేస్తారు అని అంటున్నారు.

ఇక విశాఖలోనే పవన్ సినీ కెరీర్ పరంగా శిక్షణ పొందారు. విశాఖ వీధుల్లోనే తిరిగారు. విశాఖలో ఎన్నో సినిమాల షూటింగ్స్ చేశారు. ఇవన్నీ కూడా ఏకరువు పెట్టి విశాఖ తన సిటీ అని క్లెయిం చేస్తారని అంటున్నారు. విశాఖ రాజధాని అంటూ వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఇస్తున్న నినాదాల మీద పవన్ మార్క్ కామెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ స్పీచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. టోటల్ ఏపీ పాలిటిక్స్ వెయింటింగ్ అని అంటున్నారు.

Tags:    

Similar News