రాజమండ్రి సభలో మోడీ - పవన్ మధ్య ఆసక్తికర సన్నివేశం!
ఈ సమయంలో... ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. రాజమండ్రిలో జరిగిన ప్రజాగళం సభకు హాజరయ్యారు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. భారీ ఎత్తున ప్రచార కార్య్రక్రమాలు నిర్వహిస్తున్నయి. ఈ సమయంలో ‘సిద్ధం’ అంటూ జగన్ ఏపీని హోరెత్తించేస్తే... ‘ప్రజాగళం’ అంటూ కూటమి నేతలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో... ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. రాజమండ్రిలో జరిగిన ప్రజాగళం సభకు హాజరయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఇందులో భాగంగా... రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్ శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం పవన్.. ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
అవును... రాజమండ్రి లో కూటమి ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపైకి వచ్చిన అనంతరం శాలువా కప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... స్వాగతం పలికారు. ఈ సమయంలో మోడీ కాళ్లకు పవన్ నమస్కరించబోయారు. అయితే ప్రధాని వద్దని నిరాకరించారు. కాళ్లకు నమస్కారం పెట్టవద్దని జనసేనానికి చెప్పారు!
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక, రాజమండ్రిలో జరిగిన కూటమి సభలో మాట్లాడిన పవన్... భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన మహానుభావుడు.. అయోధ్యకు రామచంద్రుడిని తీసుకువచ్చిన మహానుభావుడు మోడీ అని కొనియాడారు. ఇదే సమయంలో... మోడీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోందని అన్నారు!