విశాఖ నుంచి పవన్ వారాహి యాత్ర... టార్గెట్ ఫిక్స్...?

ఈసారి పవన్ కళ్యాణ్ విశాఖ వైపు తన వారాహి రధాన్ని తిప్పుతున్నారు. విశాఖ లో వారాహి రధయాత్ర తొందరలో సాగనుంది అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పరు.

Update: 2023-08-03 11:24 GMT

పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహి యాత్రకు అంతా ఫిక్స్ అయింది. ఈసారి పవన్ కళ్యాణ్ విశాఖ వైపు తన వారాహి రధాన్ని తిప్పుతున్నారు. విశాఖ లో వారాహి రధయాత్ర తొందరలో సాగనుంది అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పరు.

త్వరలో మొదలయ్యే ఈ యాత్రకు అంతా కలసి సహకరించాలని ఆయన కోరుతున్నారు. ఇదిలా ఉంటే విశాఖలో జనసేన కు కొందరు కీలక నాయకులు ఉన్నారు. రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేరారు. ఇపుడు వీరందరూ కలసి వారాహి రధయాత్రను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.

పవన్ రధయాత్ర ఏఏ నియోజకవర్గాలలో సాగుతుందో రోడ్ మ్యాప్ ని కూడా రెడీ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచి పాయకరావుపేట మీదుగా ఉమ్మడి విశాఖలోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. జనసేన టార్గెట్ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల లిస్టులో చోడవరం, యలమంచిలి, అనకాపల్లి ఉన్నాయి. అలా రూరల్ ఏరియాలో వారాహి రధయాత్ర పూర్తి చేసుకుని విశాఖ సిటీ లోకి గాజువాక ద్వారా ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.

అలా గాజువాక నుంచి పెందుర్తి వైపుగా వచ్చి విశాఖ పశ్చిమం, ఉత్తరం, భీమిలీల లో వారాహి యాత్ర సాగుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఉమ్మడి విశాఖలో పదిహేను ఎమ్మెల్యే సీట్లు ఉంటే సగానికి పైగా నియోజకవర్గాలలో వరాహి రధ యాత్ర సాగేలా జనసేన డిజైన్ చేస్తోంది అని అంటున్నారు.

ఇక ఇందులో జనసేన కచ్చితంగా పొత్తు ఉన్నా లేకపోయినా పోటీ చేసే సీట్లుగా ఎలమంచిలి, అనకాపల్లి, గాజువాక, పెందుర్తి, విశాఖ నార్త్, భీమునిపట్నమని చెబుతున్నారు. అంటే ఆరు సీట్లకు తగ్గకుండా పొత్తులో భాగంగా విశకహ జిల్లాలో తీసుకోవాలని జనసేన ప్లాన్ గా ఉంది అని తెలుస్తోంది.

ఇందులో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, భీమిలీ నుంచి గెలిచారు. వీ సీట్లను కచ్చితంగా పొత్తులో అయినా తీసుకోవడంతో పాటు అదనంగా విశాఖ నార్త్, ఎలమంచిలి సీట్లను తీసుకోవాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.

విశాఖ జిల్లాలో పవన్ వారాహి యాత్ర పదిహేను రోజుల పాటు సాగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒక రోజు ఆయా నియోజకవర్గంలో సమీక్ష మరో రోజు బహిరంగ సభలతో వారాహి యాత్ర సాగనుంది అని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ జనసేన విశాఖ లో పోటీ చేసే సీట్లు, పొత్తులో భాగంగా ఎన్ని కోరబోతున్నారు అన్న దాని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News