హెచ్-1బీ వీసా రెన్యువల్ కి పైలెట్ ప్రాజెక్ట్... నిపుణులకు మాత్రమే!

కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునే విధంగా అమెరికా ఇటీవల ఓ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Update: 2023-12-06 07:19 GMT

కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునే విధంగా అమెరికా ఇటీవల ఓ పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమం మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని అమెరికా విదేశాంగ వెల్లడించింది. హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేం కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపట్టింది.

అవును... హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించే కార్యక్రమాల్లో భాంగా... కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ కార్యక్రమం 3 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది కేవలం నిపుణులకు మాత్రమేనని తెలిపింది. ఆయా నిపుణుల కుటుంబీకులకు కానీ, వారిపై ఆధారపడిన వారికి కానీ ఇది వర్తించదని తెలిపింది.

ఈ క్రమంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టడానికి గల కారణాలు, అది నిపుణులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందనే విషయాలు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా... గతంలో వీసా రెన్యువల్‌ కోసం అమెరికా విడిచి వెళ్లాల్సి వచ్చేదని.. అయితే ఈ కొత్త పైలెట్ ప్రాజెక్ట్ ఈ సమస్య నుంచి గణనీయ మార్పు తీసుకువస్తుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ తెలిపారు.

ఇదే సమయంలో ఈ సౌలభ్యాన్ని నిపుణుల కుటుంబీకులకు విస్తృత పరిచేముందు వాటి ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉందని తెలిపారు. హెచ్‌-4 కింద నిపుణుల కుటుంబీకులకు కానీ... వారిపై ఆధారపడిన వారిని కానీ ఇందులో చేర్చాలని కోరుతూ ఆయా సంస్థల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించారు.

అమెరికాలోనే వీసాలను పునరుద్ధరించే ఈ ప్రత్యేక కార్యక్రమం కింద తొలుత 20వేల మందికి వీసా రెన్యువల్‌ చేయనున్నారని తెలుస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖకు వీసాలను పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో వారు దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేదు. కాగా... గతంతో వీరంతా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేదనే విషయం తెలిసిందే.

Tags:    

Similar News