మహాలక్ష్మీ హత్యకేసులో కీలక పరిణామం... వీడుతున్న మిస్టరీ!

బెంగళూరులో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

Update: 2024-09-23 17:30 GMT

బెంగళూరులో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మహాలక్ష్మీని ముక్కలు ముక్కలుగా నరికి గదిలోని రిఫ్రిజిరేటర్ లో పెట్టడంతో అది కాస్తా దుర్వాసన వెదజల్లింది. ఈ సమయంలో మహాలక్ష్మీని సుమారు 31 ముక్కలుగా నరికినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... మహాలక్ష్మీ అనే మహిలను దారుణంగా హత్య చేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టారు. ఈ సమయంలో దుర్వాసన రావడంతో ఇంటి యజమాని బంధువులను పిలిచి గది తలుపులు ఓపెన్ చేసి చూశారు. ఈ సమయంలో ఫ్రిజ్ లో ఈ దారుణం వెలుగుచూసింది. ఇందులో భాగంగా... మహాలక్ష్మీ ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ సమయంలో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ కమీషనర్ దయానంద్ స్పందిస్తూ... ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రధాన నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడించలేమని.. దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కాగా మహాలక్ష్మీ... మళ్లేశ్వరంలోని ఓ మాల్ లో పనిచేస్తోంది. భర్తకు దూరంగా ఉంటూ జీవిస్తోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆమెను రోజూ పికప్ చేసుకుని, డ్రాప్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో... అతడికీ, ఈ హత్యకూ సంబందం ఉండొచ్చని భావిస్తున్నారు. మరోపక్క.. విషయం తెలుసుకున్న ఆమె భర్త సంఘటనాస్థలికి చేరుకున్నారు.

ఈ సమయంలో డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనాస్థలి నుంచి బాధితురాలి మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ఆమె కాల్ రికార్డులు, వాట్సప్ ఛాట్ లను సమీక్షిస్తున్నారు. తదుపరి అనాలసిస్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారని అంటున్నారు!

ఇక ఈ హత్యపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సీ.డబ్ల్యూ)వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో... కాలపరిమితితో కూడిన విచారణ జరిగేలా చూడాలని రాష్ట్ర పోలీసులను మహిళా కమిషన్ ఆదేశించింది. మూడు రోజుల్లో వివరణాత్మక నివేదిక అందించాలని సూచించింది.

Tags:    

Similar News