బిగ్ బ్రేకింగ్ : పోసాని కృష్ణమురళి అరెస్ట్!
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టు అయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఆంధ్రా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టు అయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఆంధ్రా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాయచోటి పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నారు. ఈ అరెస్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
-పోసాని పై సాంబేపల్లి స్టేషన్ లో కేసు
అన్నమయ్య జిల్లా సాంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. 352(2), 111 R/W (3)5 బీఎన్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
- రాజకీయాల నుంచి విరమణ
గతంలో వైసీపీకి మద్దతుగా మాట్లాడిన పోసాని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత పోసాని పెద్దగా ప్రజా జీవితంలో కనిపించలేదు. గతంలో మాదిరిగా మీడియా సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. ముఖ్యంగా వైసీపీ అనుకూల ఛానెల్ అయిన సాక్షి టీవీలో కూడా ఆ మధ్య ఓ ప్రోగ్రాం ప్రకటించి ఇప్పుడు అందులో కూడా ఆయన కనిపించడం లేదు.
- సినిమాలు తగ్గించిన పోసాని
పోసాని కృష్ణమురళి గతంలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. అయితే, ఇటీవల ఆయన సినిమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ వ్యాఖ్యానాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పోసాని, సినిమాల్లో ఫోకస్ తగ్గించారు.
ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని ఏపీకి తరలిస్తున్న పోలీసులు, తదుపరి విచారణపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసు రాజకీయంగా మరింత ముదిరే అవకాశం ఉంది. పోసాని అరెస్టుపై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.