మోడీని హీరో చేస్తున్న ఇండియాకూటమి ?

అవును మీరు చదివింది నిజమే. నరేంద్రమోడీని హీరోని చేస్తోంది ప్రతిపక్ష ఇండియాకూటమే అనటంలో సందేహంలేదు.

Update: 2023-09-07 05:50 GMT

అవును మీరు చదివింది నిజమే. నరేంద్రమోడీని హీరోని చేస్తోంది ప్రతిపక్ష ఇండియాకూటమే అనటంలో సందేహంలేదు. రాబోయే ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలన్న టార్గెట్ తో 28 ప్రతిపక్షాలు కలిసి ఇండియాకూటమి ఏర్పాటు చేసుకున్నాయి. అంటే కూటమి ఎంత పకడ్బందీగా వ్యవహరించాలి. కూటమి తరపున చేసే ఆరోపణలు, విమర్శల్లో ఎంతటి పదునుండాలి ? కూటమిలో పార్టీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పార్టీల తరపున మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువమంది ఉన్నారు.

అందుకనే ఎవరిపడితే వాళ్ళు నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, మంత్రి ఉధయనిధి చేసిన సనాతన ధర్మం వ్యాఖ్యలు ఇపుడు దేశంలో మంటలు మండిస్తోంది. సనాతన ధర్మం అన్నది డెంగ్యు, మలేరియా లాంటి విషజ్వరం లాంటిదని చెప్పారు. నిజానికి సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసేంత స్ధాయి, లోతైన పరిజ్ఞానం ఉధయనిధికి ఉందా అన్నది కీలకం. క్రిస్తియన్ అయిన స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు.

అసలు సనాతన ధర్మాన్ని కించపరుస్తు ఎందుకు మాట్లాడారు ? మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా అర్ధంకాలేదు. పైగా కొడుకు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దాంతో దేశంలోని హిందు పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందు సంస్ధలన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయాయి. దేశమంతా మంటలు మండిస్తు నానా గోలచేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు కచ్చితంగా మోడీని హీరోగా చేస్తాయనటంలో సందేహంలేదు.

జమిలి ఎన్నికలు, ఇండియా పేరును భారత్ గా మార్చటం లాంటివి కూడా మోడీకి సానుకూలంగానే కనిపిస్తున్నాయి. దేశంపేరును ఇండియా అని ఉంచినా, భారత్ అని మార్చినా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదు. ఇక జమిలి ఎన్నికలు కూడా మోడీకే అడ్వాంజేట్ అవబోతున్నాయి. జమిలి ఎన్నికలను, దేశం పేరు మార్పుని ఎలా తట్టుకోవాలని ఆలోచిస్తున్న ఇండియాకూటమికి ఉదయనిధి స్టాలిన్ రూపంలో సెల్ఫ్ గోల్ వేసిన ప్లేయర్ ఎదురయ్యాడు. దాంతో ఇపుడు ఇండియాకూటమికి ఉదయనిధి కామెంట్లను ఎలా సమర్ధించుకోవాలో అర్ధంకావటంలేదు. ఎవరు పడితే వాళ్ళు తమ స్ధాయికి మించి మాట్లాడే మాటలన్నీ మోడీని హీరోని చేస్తాయనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News