ఎవరికీ తెలియకుండా కూటమి కోసం కృషి... రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు!

నరసాపురం లోక్ సభ స్థానం తనకు దక్కకపోవడంపై రఘురామ కృష్ణం రాజు చెబుతున్న మాటలు, ఇస్తున్న స్టేట్ మెంట్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి.

Update: 2024-04-02 03:54 GMT

నరసాపురం లోక్ సభ స్థానం తనకు దక్కకపోవడంపై రఘురామ కృష్ణం రాజు చెబుతున్న మాటలు, ఇస్తున్న స్టేట్ మెంట్లు ఆసక్తికరంగా ఉంటున్నాయి. తనకు టిక్కెట్ దక్కకపొవడంపై ఇప్పటివరకూ ప్రధానంగా మూడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆయన... తాజాగా మరింత ఆసక్తికరంగా నాలుగో వ్యాఖ్యలు చేశారు. దీంతో... రఘురామ పరిస్థితి ఎలా అయ్యిపోయింది పాపం అని కొంతమంది ఆవేదన చెందుతుంటే.. టిక్కెట్ వచ్చి తీరుతుందని, లేకపోతే కూటమి సంగతి చూస్తామంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

నరసాపురం లోక్ సభ టిక్కెట్ రఘురామ కృష్ణంరాజుకి దక్కకపోవడంపై ఆయనతో పాటు ఆయన అభిమానులు అవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! సుమారు నాలుగున్నరేళ్లుగా ఏపీలో అసలు సిసలు ప్రతిపక్ష పాత్ర పోషించింది అతడే అని.. అలాంటి వ్యక్తికి టిక్కెట్ ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని.. రఘురామను కూడా బలిచేయడం భావ్యం కాదని అంటున్నారు. ఈ సమయంలో... స్పందించిన రఘురామ... ఏపీలో టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ కలవడం కోసం తాను ఎంతో కృషి చేసినట్లు చెప్పారు.

అవును... టీడీపీ - జనసేన మాత్రమే కూటమిగా ఉన్న సమయంలో.. ఆ కూటమిలో బీజేపీ కూడా కలవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ఇది తప్పనిసరి అని.. ఈ కూటమి కలయిక కోసం తాను పడిన కష్టాలు, తిన్న చీవాట్లు తనకు మాత్రమే తెలుసంటూ పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన నేపథ్యంలో... ఎవరికీ తెలియకుండా తాను కూడా తాను కూడా కూటమిలో బీజేపీ చేరాలని ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపినట్లు తెలిపారు.

ఇదే సమయంలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నట్లు తెలిపిన రఘురామ... రానున్న ఎన్నిక్కల్లో జగన్ కావాలా వద్ద అనే అంశం కోసమే జరగబ్నున్నాయని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి జగన్ పాలన విముక్తి కోసం ఎవరు ఎంత చేశారో అందరికీ తెలుసని చెప్పిన రఘురామ... 50 లక్షలమంది కార్యకర్తలు ఉన్న పార్టీలు కృషిచేయడం అభినందనీయమే కానీ.. ప్రాణాలకు తెగించి ఒంటరి పోరాటం చేయడం ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలని అన్నారు.

ఈ నేపథ్యంలో తనకు టిక్కెట్ దక్కుతుందనే నమ్మకం ఉందని రఘురామ చెప్పడం గమనార్హం! కొద్దిపాటి సమాచార లోపం వల్లే తనకు టిక్కెట్ దక్కలేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ... చంద్రబాబు తనకు తప్పకుండా న్యాయం చేస్తారనే పరిపూర్ణమైన విశ్వాసం ఉందని.. ఒకటి రెండు రోజుల్లో తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని వెల్లడించారు.

కాగా.. తనకు టిక్కెట్ దక్కకపోవడంపై గతంలో స్పందించిన రఘురామ... తనకు టిక్కెట్ దక్కకపోవడానికి జగన్ కారణం అని, ఇది అతడి విజయం అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం... నమ్ముకున్న తనకే టిక్కేట్ ఇప్పించలేకపోతే, రేపు పోలవరం వంటి ప్రాజెక్టులను నిధులు ఎలా తెస్తారనే అనుమానం ప్రజల్లో కలిగే అవకాశం ఉందంటు చంద్రబాబుని ఇద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గత కొన్ని రోజులుగా.. తనకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఉందని చెబుతున్నారు!



Tags:    

Similar News