మరుగున పడి వెలుగులోకి వచ్చిన లోకో పైలెట్ 'మరుగు' సమస్య!

భారతీయ రైల్వే చరిత్ర ఈనాటిది కాదనే సంగతి తెలిసిందే. భారతదేశంలో తొలిసారిగా 1863లో రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

Update: 2025-02-28 00:30 GMT

భారతీయ రైల్వే చరిత్ర ఈనాటిది కాదనే సంగతి తెలిసిందే. భారతదేశంలో తొలిసారిగా 1863లో రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ సమయంలో మొదట్లో స్టీమ్ ఇంజిన్లు, ఆ తర్వత డీజిన్ ఇంజిన్లు, కొన్నేళ్ల తర్వత ఎలక్ట్రికల్ ఇంజిన్లు వచ్చాయి. ఇప్పుడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు, త్వరలో బుల్లెట్ ట్రైన్ లు అనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ఆధునికీకరణతో ముందుకు వెళ్తోంది. రెగ్యులర్ గా రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో భారతీయ రైల్వేకు మంచి గుర్తింపు ఉంది. ఆ సంగతి అలా ఉంటే.. ఇంత చరిత్ర ఉన్న ఇండియన్ రైల్వేలో లోకో పైలెట్ కనీస అవసరాలపై మాత్రం అలసత్వం కనిపిస్తూనే ఉంది.

అవును.. రైలు బోగీల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో టాయిలెట్స్ విషయానికొస్తే.. ప్రయాణికులకు బోగికి ఆ చివర రెండు, ఈ చివర రెండు చొప్పున మొత్తం నాలుగు టాయిలెట్స్ ఉంటాయి! అయితే అనూహ్యంగా.. రైలు నడిపే లోకో పైలెట్ కు మాత్రం ఈ అవసరం మరుగున పడిపోయింది.

దీంతో... "మరుగు" విషయాల విషయంలో ఇండియన్ రైల్వే లోకో పైలెట్లు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచీ రైలు ఇంజన్ లో లోకో పైలెట్ కు టాయిలెట్ల సదుపాయం లేదు!

ఎప్పటికప్పుడు రైల్వే వ్యవస్థలో ఆధునికత సంతరించుకుంటున్నప్పటికీ రైలింజన్ లో మాత్రం మరుగుదొడ్లకు ప్రాధాన్యత దక్కడ లేదు! గత 170 ఏళ్లుగా పరిస్థితి ఇలానే ఉంది. దీంతో.. లోకో పైలెట్ "మరుగు" సమస్య మరుగున పడిపోతూనే ఉంది. ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట దర్శనమిచ్చింది.

రోజంతా ట్రైన్ నడిపే లోకో పైలెట్ కు టాయిలెట్ వస్తే కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. క్యాబిన్స్ లో టాయిలెట్స్ ఏర్పాటు చేయకపోవడంతో తాజాగా ఓ లోకో పైలెట్ ముంబై లోకల్ ట్రైన్ ను మధ్యలోనే ఆపేశాడు. ఈ సమయంలో ట్రాక్ మధ్యలోనే మూత్ర విసర్జన చేశాడు. అనంతరం ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే.. కొత్తగా వచ్చిన రైళ్లలో మాత్రం వీరికి టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. లోకో పైలెట్ల ఇబ్బంది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News