ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తాం : రాజాసింగ్

మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని కూల్చడానికి అవసరమైతే తెలంగాణ హిందువులు మహారాష్ట్ర వెళ్లాలని.. అక్కడి ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడవేద్దామని రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-31 10:01 GMT
ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడేస్తాం : రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేసి సముద్రంలో కలిపేస్తామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణలోని హిందువులు మహారాష్ట్రలోని హిందువులకు మద్దతుగా వెళ్తారని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో భారత్‌ను హిందూ దేశంగా మారుస్తామనే ప్రకటన ఉండాలని రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికలు కాశీ, మథుర, హిందూ రాష్ట్రం అనే అంశాల చుట్టూ తిరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశాల మేరకే అనుమతి రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఈసారి అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయలేదని ఆయన తెలిపారు. ఇది మన దేశం.. మన హిందూ దేశం.. మన హిందూ దేశంలో శోభయాత్ర చేసుకోవడానికి మనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఈసారి శోభయాత్ర నిర్వహించి తీరుతామని సంచలన ప్రకటన చేశారు. పర్మిషన్ లేకుండానే శోభాయాత్ర తీరుద్దామని స్ఫష్టం చేశారు.

మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని కూల్చడానికి అవసరమైతే తెలంగాణ హిందువులు మహారాష్ట్ర వెళ్లాలని.. అక్కడి ఔరంగజేబు సమాధిని కూల్చి సముద్రంలో పడవేద్దామని రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబు, బాబర్ వారసులు కలవరపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని కొందరు చేస్తున్న ప్రకటనలతో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శంభాజీనగర్ జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిణిని దుర్భాషలాడారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, నాగ్‌పూర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొందరు వ్యక్తులు రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Full View
Tags:    

Similar News