దేశంలో మరే మీడియా అధినేతకు దక్కని అరుదైన గౌరవం
దేశ చరిత్రలో మరే మీడియా అధినేతకు.. మీడియాలో పని చేసిన ఉద్యోగికి దక్కని అరుదైన గౌరవాన్ని రామోజీ సొంతం చేసుకున్నారు.
ఉన్నన్ని రోజులు తన చుట్టూ ఉన్న సమాజం కోసం.. దాని హితం కోసం తపించే వ్యక్తి కోసం.. అతను ఉన్నప్పుడే కాదు శాశ్వితంగా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి దక్కాల్సిన గౌరవ మర్యాదల విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవటం జరుగుతుంది. మీడియా మొఘల్ గా పేరున్న ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఇప్పుడు అలాంటి గౌరవమే దక్కింది.
దేశ చరిత్రలో మరే మీడియా అధినేతకు.. మీడియాలో పని చేసిన ఉద్యోగికి దక్కని అరుదైన గౌరవాన్ని రామోజీ సొంతం చేసుకున్నారు. రామోజీ అంతిమ సంస్కారాల్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో జరుగుతున్న సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన.. రామోజీ మరణం గురించి తెలిసినంతనే.. ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి.. అంతిమ సంస్కారాల్ని అధికార లాంఛనాలతో చేపట్టాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.
ఇందుకోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు.. రాచకొండ సీపీకి ప్రత్యేక బాధ్యతలు చేపట్టారు.తాను అభిమానించే రామోజీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన రీతిలో రియాక్టు అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది.
నిజానికి రామోజీరావు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారాన్ని పొందిన ఆయనకు అధికారిక లాంఛనాలతో సాగనంపటం సముచితం. ఇంతటి గౌరవ మర్యాదల్ని దక్కించుకున్న తొలి మీడియా అధినేతగా రామోజీ నిలిచిపోతారని చెప్పక తప్పదు.