గౌతమ్ అదానీకి ఇప్పటివరకు సమన్లు అందలేదా?
ఇదిలా ఉంటే.. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లోని గౌతమ్ అదానీ ఇంటికి యూఎస్ అధికారులు సమన్లు పంపారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సోలార్ పవర్ ట్రాన్స్ మిషన్ కోసం లంచాలు ఇచ్చారని ఆరోపిస్తూ.. దానికి సంబంధించిన సమాధానాల్ని తమకు ఇవ్వాల్సిందిగా అమెరికాకు చెందిన సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్ సమన్లు పంపినట్లుగా వార్తలు రావటం.. దాని ప్రభావం స్టాక్ మార్కెట్ మీదా.. అదానీ గ్రూపు షేర్ల మీద భారీగా పడడటం తెలిసిందే. సుమారు రూ.2200 కోట్ల లంచాన్ని అదానీ ఇచ్చారన్న ఆరోపణలు రావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లోని గౌతమ్ అదానీ ఇంటికి యూఎస్ అధికారులు సమన్లు పంపారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ఆ మాటకు వస్తే.. విదేశీ పౌరులకు అమెరికాకు చెందిన సంస్థ సమన్లు జారీ చేసే అధికార పరిధి ఉందా? అన్నది మరో సందేహంగా మారింది. తాజాగా వినిపిస్తున్న వాదన ప్రకారం.. అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీతో పాటు.. ఆయన సోదరుడు కుమారుడు సాగర్ లకు సమన్లు అందజేయాలంటే.. అందుకు తగిన దౌత్య మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. తాము జారీ చేసిన సమన్లను అందుకున్న 21 రోజుల్లోపు సమాధానం ఇవ్వకుంటే.. వారికి వ్యతిరేకంగా తీరపు వెలువడుతుందని సమన్లలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు గౌతమ్ అదానీ నివాసానికి కానీ.. ఆయన కార్పొరేట్ ఆఫీసుకు కానీ ఎలాంటి సమన్లు అందలేదని చెబుతున్నారు. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సమన్లను అహ్మదాబాద్ లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్ కు.. అదే నగరానికి చెందిన సాగర్ కు చెందిన బోదక్ దేవ్ ఇంటికి సమన్లు పంపినట్లుగా చెబుతున్నా.. అలాంటిదేమీ తమకు అందలేదన్న విషయాన్ని అదానీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. అమెరికా సంస్థ ఏకాఏకిన వచ్చి.. గౌతమ్ అదానీ.. ఆయన సోదరుడు కొడుక్కి సమన్లు ఇచ్చేయటం జరగదని.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా కానీ ఇతర దౌత్య మార్గాలను అనుసరించి మాత్రమే సమన్లు అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా.. వార్తలు వచ్చినంత వేగంగా.. సమన్లు గౌతమ్ అదానీ చేతికి చేరే అవకాశం ఉండదన్న విషయాన్ని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.