కొత్త చట్టం... సైన్యంలో చేరితో రూ.80 లక్షల రుణమాఫీ!
ఈ క్రమంలో... తాజాగా ఏడాది పాటు సైన్యంలో పని చేయడానికి సిద్ధపడితే రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సాధారణంగా భారత్ లో ఎన్నికల సీజన్ లో ఎక్కువగా వినిపించే హామీల్లో ఒకటి "రుణమాఫీ" అని! అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినా, చేయకపోయినా ఈ హామీ చాలా పవర్ ఫుల్! ఈ క్రమంలో... తాజాగా ఏడాది పాటు సైన్యంలో పని చేయడానికి సిద్ధపడితే రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఉక్రెయిన్ తో 1000 రోజులు దాటి యుద్ధం చేస్తున్న రష్యాకు సైన్యం కొరత విపరీతంగా ఉందని అంటున్నారు. పైగా ఈ పోరులో మరణాలు, గాయాల రూపంలో రష్యా అత్యధిక సంఖ్యలో సైన్యాన్ని నష్టపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి సుమారు 11వేల మంది సైనిక సాయం పొందిందని దక్షిణ కొరియా, అమెరికాలు చెబుతున్నాయి.
మరోపక్క ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే రష్యా యువత చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఓ ఆసక్తికర ఆఫర్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... కొత్తగా సైన్యంలో చేరేవారికి రుణమాఫీ చేయాలనే చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై పుతిన్ సంతకం కూడా చేశారు.
అవును... ఉక్రెయిన్ తో అవిరామంగా జరుగుతున్న యుద్ధానికి సైన్యాన్ని మరింత పెంచుకునేందుకు రష్యా సరికొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగా... ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడేవరికి కోటి రూబుల్స్ వరకూ (సుమారు రూ.80 లక్షలు) రుణమాఫీ చేయడానికి సిద్ధపడింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తెచ్చింది.
మరోపక్క రష్యా ఇప్పటికే ఉ.కొరియా సేనలను ఉపయోగించుకుంటుందని చెబుతున్న వేళ.. యెమెన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు మంచి జీతం, రష్యా పౌరసత్వం ఇస్తామని యెమెన్ పౌరులను రష్యాకు తరలిస్తున్నారని.. అనంతరం బలవంతగా సైన్యంలో చేర్చుకుని సరిహద్దులకు పంపిస్తున్నారని అంటున్నారు.