మతం ఉద్రిక్తత: మమతా కులకర్ణి పదవి హుష్ కాకి!
కిన్నార్ అఖాడాలో ప్రముఖ వ్యక్తి, ప్రసిద్ధ లింగమార్పిడి హక్కుల కార్యకర్త అయిన లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని తన విధుల నుండి తొలగిస్తారని పుకార్లు వినిపించాయి.
ప్రయాగ్ రాజ్ (యూపి)-మహా కుంభమేళా సాక్షిగా వింతలు, విచిత్రాలు బయటపడ్డాయి. 2000 కోట్ల డ్రగ్స్ స్కామ్ లో ప్రముఖురాలిగా వార్తలకెక్కిన వివాదాస్పద నటి మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించిన విషయం కుంభమేళా సాక్షిగా బయటపడటంతో స్వామీజీల్లో దీనిపై బోలెడంత రచ్చ సాగింది. చాలా మంది ప్రముఖ స్వామీజీలు, గౌరవనీయ మాతాజీలు మమతాకు కట్టబెట్టిన పదవి గురించి ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మమతా కులకర్ణికి గౌరవనీయమైన మహామండలేశ్వర్ పదవిని కట్టబెట్టడంపై సంస్థలోని అనేక మంది సభ్యుల నుండి ప్రతిఘటన ఎదురైంది. చిత్ర పరిశ్రమలో నటి మమతా కులకర్ణి గతాన్ని ఉటంకిస్తూ చాలా మంది ఆమె నియామకాన్ని ప్రశ్నించారు. ఈ తప్పుడు నిర్ణయం స్వామీజీల గ్రూప్‌లో తీవ్ర విభేదాలకు దారితీసింది. చివరికి వారి నాయకత్వం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కిన్నార్ అఖాడాలో ప్రముఖ వ్యక్తి, ప్రసిద్ధ లింగమార్పిడి హక్కుల కార్యకర్త అయిన లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని తన విధుల నుండి తొలగిస్తారని పుకార్లు వినిపించాయి. అయితే మమతా కులకర్ణికి కట్టబెట్టిన గౌరవ పదవి నుంచి తొలగించాలనే త్రిపాఠి నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. మమతా గురించి తమకు తెలియకుండానే మహామండలేశ్వరిగా చేశారని అఖాడా ప్రత్యారోపణలు చేసింది.
గత శుక్రవారం మమతా కులకర్ణి ప్రయాగ్‌రాజ్‌లోని సంఘం ఘాట్‌లో `పిండ్ దాన్` చేశారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ...ఇది మహాదేవ్, మహా కాళి ఆదేశం.. నా గురువు ఆదేశం.. వారు ఈ రోజును ఎంచుకున్నారని తెలిపారు. అయితే లక్ష్మీ నారాయణ్ సారథ్యంలోని అఖాడా వెర్షన్ వేరొకలా ఉంది. లక్ష్మీ నారాయణ్ కు ప్రతిదీ తెలిసే జరిగిందనేందుకు ప్రూఫ్ ఉంది.
కిన్నర్ అఖాడా మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ చేయబోతోందని అఖాడా సభ్యులు ప్రకటించారు. ఆమెకు శ్రీ యమై మమతా నందగిరి అని పేరు కూడా పెట్టారు. ఒకటిన్నర సంవత్సరాలుగా కిన్నర్ అఖాడాతో , నాతో సంప్రదింపులు జరుపుతోందని లక్ష్మీ నారాయణ్ అన్నారని కథనాలొచ్చాయి. మమతా కోరుకుంటే ఏ భక్తి మూర్తి పాత్రనైనా పోషించడానికి అనుమతి ఉందని వారు అన్నారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా తనను పదవి నుంచి అఖాడా తొలగించింది.
మాజీ నటి మమతా కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కిన్నార్ అఖాడా నుండి బహిష్కరిస్తున్నట్లు జూనా అఖాడా మీడియాకు ఒక ప్రకటనలో ప్రకటించింది. మతపరమైన అంతర్గత ఉద్రిక్తతల గురించి జూనా అఖాడాకు తెలిసిన తర్వాత ఈ నిర్ణయం వెలువడిందని కథనాలొచ్చాయి. ఇంతలోనే మమతా కులకర్ణిని పదవి నుంచి తొలగిస్తున్నట్టు గురువు లక్ష్మీ నారాయణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.