ఫేస్ బుక్ లో అమ్మాయి వల... ఆర్మీ రహస్యాలు పాక్ కు పంపించాడు!!

అవును... పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ. కు గూఢచర్యం చేస్తూ.. భారత రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.;

Update: 2025-03-14 23:30 GMT

అమ్మాయిల వలపుల వలలో పడి జీవితాలు నాశనం చేసుకొన్న చాలా మంది గురించి చాలాసార్లు వినే ఉంటారు. ఈ విషయంలో కొంతమందికి పర్సనల్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండే ఉంటుంది! అయితే... తమ తమ జీవితాలు నాశనం చేసుకోవడం సంగతి అలా ఉంటే... వలపుల వలలో పడి ఏకంగా దేశ మిలటరీ రహస్యాలు పాక్ కు లీక్ చేసిన ఓ ప్రభుద్ధుడి వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ. కు గూఢచర్యం చేస్తూ.. భారత రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో పరిచయమైన ఓ అమ్మాయి వలపుల వలలో పడి.. అతడు భారత ఆర్మీ ఆయుధాలకు సంబంధించిన అతి సున్నితమైన సమాచారాన్ని పాక్ కు అందించినట్లు తేలిందని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్ లో హజ్రత్ పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది అతడిని నేహ శర్మ అనే మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (పాక్ ఐ.ఎస్.ఐ) కోసం పనిచేస్తుంది. ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి రవీంద్ర కుమార్ తో స్నేహం చేసింది.

ఈ సమయంలో రవీంద్రకు డబ్బులు ఆశ జూపి వలపుల వల విసిరింది.. అనంతరం అతడి నుంచి మిలటరీ రహస్యాలను సంపాదించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఈ క్రమంలో వాట్సప్ లో ఆమెకు అనేక కీలక డాక్యుమెంట్లు పంపించినట్లు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. ఈ సమయంలో చంద్రన్ స్టోర్ కీపర్ గా అమె పేరును రవీంద్ర సేవ్ చేసుకున్నాడు!

అతడు పంపిన వాటిలో గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఐ.ఎస్.ఐ. సభ్యులతోనూ అతడు నేరుగా టచ్ లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు. ఈ సమయంలో నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో ఆమెకు పంపిన వివరాల్లో... 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ పరీక్షలు, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్ కమిటీ పంపిన రహస్య లేఖలు ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News