సముద్ర తీరాన్ని చూసే అనుభూతి మిస్ కావద్దని ఆమె అలా చేసిందట

పాత ఇంటి వ్యూను కొత్తిల్లు కట్టిపడేస్తుంది. ఇది అందరికి అనుభవమే. కానీ.. డబ్బులున్న ఆసామికి ఇలాంటి వాటిని ఎదుర్కొనే సత్తా.. సామర్థ్యం ఉంటుంది

Update: 2024-03-24 04:39 GMT

పాత ఇంటి వ్యూను కొత్తిల్లు కట్టిపడేస్తుంది. ఇది అందరికి అనుభవమే. కానీ.. డబ్బులున్న ఆసామికి ఇలాంటి వాటిని ఎదుర్కొనే సత్తా.. సామర్థ్యం ఉంటుంది. చేతిలో ఉన్న డబ్బుతో ఏమైనా చేసేస్తుంటారు. తాజాగా అలాంటి పని చేసిన ఒక పెద్దావిడ వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఇంతకూ ఆ పెద్దావిడ మరెవరో కాదు.. పెట్టుబడుల మాంత్రికుడిగా.. భారత వారెన్ బఫెట్ గా పేరున్న దివంగత రాకేశ్ ఝున్ ఝున్ వాలా సతీమణి రేఖా ఝున్ ఝున్ వాలా.

ఆమె నివాసం ముంబయిలోని మలబార్ హిల్స్ వద్ద ఉంటుంది. ఆమె ఇంటికి చక్కటి సముద్ర వ్యూ ఉంటుంది. ఆమె నివాసం ముందు రాక్ సైడ్ అపార్ట్ మెంట్స్ ఉంది. యాభై ఏళ్ల పాత నిర్మాణం కారణంగా ఆమె ఇంటికి బీచ్ వ్యూ బాగుంటుంది. అయితే.. సమస్య అనుకోని రీతిలో తమ ఎదురుగా ఉన్న రాక్ సైడ్ అపార్ట్ మెంట్స్ నుంచి వచ్చింది. ఆ అపార్ట్ మెంట్ ను.. మరో ఆరు బిల్డింగ్ లను క్లస్టర్ పథకంలో భాగంగా వాటిని పడేసి.. సరికొత్తగా నిర్మించే ఆలోచన చేశారు. దీనికి సంబంధించిన కాంటాక్టును ప్రముఖ బిల్డర్ షాపూర్జీ పల్లోంజి సంస్థకు అప్పజెప్పాలని భావించారు.

అదే జరిగి.. పాత భవంతుల స్థానంలో కొత్త భవంతులు వస్తే తన ఇంటికి బీచ్ వ్యూ మిస్ అవుతుందని భావించిన రేఖా ఝున్ ఝున్ వాలా మహా ఎత్తుగడ వేశారు. ఆ పాత బిల్డింగ్ లోని ప్లాట్లను ఒక్కొక్కటి చొప్పున వేర్వేరు సంస్థల ద్వారా కొనుగోలు చేయించారు. 2023 నుంచి ఇప్పటివరకు తొమ్మిది ప్లాట్లను రూ.118 కోట్లకు కొనుగోలు చేసిన విషయాన్ని ఒక మీడియా సంస్థ పబ్లిష్ చేసిన ప్రత్యేక కథనంలో వెల్లడైంది. ఆ భవంతిలో మొత్తం 24 ప్లాట్లు ఉంటే.. అందులో 19 ప్లాట్ల వారు రేఖా ఝున్ ఝున్ వాలా కుటుంబీకుల చేతిలో ఉండటం గమనార్హం.

దీంతో.. ఈ భవంతిని కొత్తగా నిర్మించాలంటే అత్యధిక ప్లాట్ల ఓనర్ల అనుమతి అవసరం. వారంతా రేఖా ఝున్ ఝున్ వాలా కంట్రోల్ లో ఉండటంతో కొత్త భవంతి నిర్మాణం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించిన బిల్డర్ (షాపూర్జీ పల్లోంజీ) తమ ప్రాజెక్టును వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. తన ఇంటికి ఉన్న బీచ్ వ్యూ మిస్ కాకూడదని.. ఆమె వేసిన ఎత్తుగడ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రేఖా ఝున్ ఝున్ వాలానా? మజాకానా?

Tags:    

Similar News