జియోహాట్‌స్టార్ ఆట షురూ... రూ.149లతో స్టార్ట్
ఒక్క ఓటీటీ ఈ స్థాయిలో వినియోగదారులు ఉండటం మరే ఓటీటీకి దక్కలేదు. జియో హాట్‌స్టార్‌గా కొత్త పేరుతో సర్వీస్‌ను అందించబోతున్నారు.
గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే రిలయన్స్ సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరో అడుగు ముందుకు వచ్చింది. జియో సినిమాతో ఇప్పటికే ఓటీటీ వ్యాపారంలో ఉన్న రిలయన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఓటీటీగా అవతరించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ను జియో సినిమా కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు ఏడాది కాలం పాటు ఈ విలీన పక్రియ జరిగింది. ఓటీటీ బిజినెస్‌లో అతి పెద్ద ఒప్పందం ఈ రెండు సంస్థల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా ఖాతాదారులు కలిపి మొత్తంగా 50 కోట్ల మంది అయ్యారు.
ఒక్క ఓటీటీ ఈ స్థాయిలో వినియోగదారులు ఉండటం మరే ఓటీటీకి దక్కలేదు. జియో హాట్‌స్టార్‌గా కొత్త పేరుతో సర్వీస్‌ను అందించబోతున్నారు. జియో హాట్ స్టార్ మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అందిస్తుంది. బేసిక్ ప్లాన్‌లో ఒక మొబైల్‌లో జియో హాట్ స్టార్‌ను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. రూ.149లతో ఇది ప్రారంభం అవుతుంది. మూడు నెలలకు రూ.149లు కాగా సంవత్సరానికి రూ.499లు ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఉన్న వారికి యాడ్స్ వస్తాయి. అంతే కాకుండా ఒకే ఒక్క మొబైల్‌లో యాప్‌ను వినియోగించే అవకాశం ఉంటుంది. మరో మొబైల్ లేదా టీవీలో ఈ యాప్ ను వినియోగించే అవకాశం ఉండదు.
ఇక రెండో ప్లాన్ ప్రకారం మూడు నెలలకు రూ.299లు. సంవత్సరానికి గాను రూ.899లు. రెండు మొబైల్స్‌లో ఈ సబ్‌స్క్రిప్షన్ తో చూడవచ్చు. అంతే కాకుండా టీవీలోనూ జియో హాట్‌స్టార్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ను ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లోనూ యాడ్స్ ఉంటాయని, దాదాపు అన్ని రకాల కంటెంట్ ఈ ప్లాన్‌లో ఉంటాయని జియో హాట్ స్టార్ ప్రకటించింది. బ్రౌజర్‌లోనూ దీనికి యాక్సెస్ చేసుకునే వీలు ఉంటుంది అంటూ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ ప్లాన్ ఒక ప్యామిలీకి అనుకూలంగా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక మూడో ప్లాన్ విషయానికి వస్తే మూడు నెలలకు కలిపి రూ.499లు. సంవత్సరానికి రూ.1499లు. ఈ ప్లాన్‌లో యాడ్స్ లేకుండా ప్రీమియం కంటెంట్‌ను చూసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రెండు మొబైల్స్‌తో పాటు, టీవీలోనూ ఈ ప్లాన్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటికే లోగోను మార్చారు. టీవీలో, మొబైల్‌లో ఉన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోగో స్థానంలో కొత్త లోగో వచ్చి ఉంటుంది. మీరు ఇంకా చూడనట్లయితే చూడండి. మీరు పాత ఖాతాదారులు అయితే ఆ ప్లాన్ కొనసాగుతుంది. ఆ ప్లాన్ పూర్తి అయిన తర్వాత కొత్త ప్లాన్ లు అమలులోకి వస్తాయి.