స్పేస్ ఎక్స్ తో జియో డీల్ : దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు

జియో, ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.;

Update: 2025-03-12 06:30 GMT

ఇంటర్నెట్‌ సేవలు లేకుండా నేటి ప్రపంచాన్ని ఊహించలేము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను విస్తరించేందుకు టెలికాం కంపెనీలు నిరంతరం కొత్త చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో తమ వినియోగదారులకు మరింత మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది.

జియో, ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. మార్చి 12న ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేసినట్లు జియో ప్రకటించింది.

ఈ భాగస్వామ్యంతో దేశంలోని అత్యంత దూరప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నమ్మకమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో తన రిటైల్ అవుట్‌లెట్లు , ఆన్‌లైన్ స్టోర్‌ ద్వారా స్టార్‌లింక్ సొల్యూషన్ అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఒప్పందంతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా, స్పేస్‌ఎక్స్ భూమి కక్ష్య ఉపగ్రహ వ్యవస్థ నిర్వహించే ప్రధాన సంస్థగా మారనుంది. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు అధునాతన ఇంటర్నెట్ సేవలు చేరువ కానున్నాయి.

ఇప్పటికే ఎయిర్ టెల్ కూడా స్టార్ లింక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో స్టార్‌లింక్ సంస్థకు అవసరమైన అనుమతులు లభించిన తర్వాత, జియో, ఎయిర్‌టెల్ సంయుక్తంగా శాటిలైట్ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు అంచనా. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను జియో మార్చి 12న తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించింది.

Tags:    

Similar News