జగన్ ఫోన్ చేయలేదు అంటున్న రేవంత్ !
తాను తెలంగాణా సీఎం అయ్యాక ఏపీ సీఎం జగన్ నుంచి కనీసం అభినందన కాల్ కూడా రాలేదని ఆయన చెప్పారు. అయితే జగన్ విషయంలో తనకున్న అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను తెలంగాణా సీఎం అయ్యాక ఏపీ సీఎం జగన్ నుంచి కనీసం అభినందన కాల్ కూడా రాలేదని ఆయన చెప్పారు. అయితే జగన్ విషయంలో తనకున్న అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు.
జగన్ విషయంలో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. నాకు ఆయన ప్రత్యర్ధి కూడా కారు అలా అనుకోవడం లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. రాహుల్ ప్రధాని కావాలని తాను మోదీ ప్రధాని అని ఆయన ఇలా మా ఆలోచనలే భిన్నంగా ఉండవచ్చు అని రేవంత్ రెడ్డి విశ్లేషించారు.
తనకు కర్నాటక తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలు ఎలాగో ఏపీ కూడా అలాగే అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయా చోట్ల కాంగ్రెస్ స్థానిక నాయకత్వాలు స్పందిస్తాయని కాంగ్రెస్ వాదిగా తాను కూడా అంతే అన్నారు.
జగన్ విషయంలో ఓపెన్ గా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి సీఎం అయి నెల రోజులు అయిన సందర్భంగా వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా అనేక విషయాల మీద అభిప్రాయాలు వెల్లడించారు.
తమ పార్టీ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ గురి పెడుతుందని అనుకోవడం లేదు అన్నారు. అదే కనుక జరిగితే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ గానే ఉంది.