రేవంత్ రెడ్డి, కేసీఆర్ బూతుల ఫైట్
రాజకీయాల్లో విలువలు నశిస్తున్నాయి. హుందాగా ఉండాల్సిన వారు గతి తప్పుతున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు
రాజకీయాల్లో విలువలు నశిస్తున్నాయి. హుందాగా ఉండాల్సిన వారు గతి తప్పుతున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. పరుష పదజాలం వాడుతున్నారు. వాడేంటి? వీటేంటి అంటూ హద్దులు దాటుతున్నారు. దీంతో రాజకీయాలంటేనే అసహ్యం కలిగేలా చేస్తున్నారు. గతంలో సద్విమర్శలు చేసేవారు. ఒక విమర్శ చేస్తే దానికి కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు ఆ విలువలు నశించాయి. ఎంత బూతు మాట్లాడితే అంత బాగా ప్రాచుర్యం పొందడం ఖాయమని తెలుసుకుని అలా చేస్తున్నారు.
రండగాళ్లు, దద్దమ్మలు, దొంగనాకొడుకులు, లంగలు అంటూ తిట్టుకోవడం చూస్తుంటే ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఇన్ని బూతులున్నాయా అని పెదవి విరుస్తున్నారు. మంచి భాష ఉండగా బూతు పదాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. వారు మామూలు వ్యక్తులు కాదు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ లు తమ బూతుల పవర్ చూపిస్తున్నారు.
తెలుగు భాషలో ఉన్న బూతులు మరే భాషలో ఉండవని తెలుసు. కానీ వాటిని అంత బాగా గుర్తు పెట్టుకున్నారని అంటున్నారు. నరం లేని నాలుక నలభై విధాలుగా మాట్లాడుతుందని అంటుంటారు. అది వీళ్లను చూసే కావొచ్చు. బూతులతోనే కాలం గడుపుతున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బూతులు వీరి కోసమే అన్నట్లు కనిపిస్తోంది.
కోట్లాది మందికి ప్రతినిధులే కానీ వారి భాష చూస్తే భయం కలుగుతుంది. మంచి సౌమ్యంగా మాట్లాడాల్సిన వారు గతి తప్పి ప్రవర్తిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలతో బూతు సాహిత్యం చదువుతున్నారు. బూతులకు అంబాసిడర్లుగా మారుతున్నారు. వారి బూతు సాహిత్యం చూస్తే ఆశ్చర్యమేస్తోంది. ఈనేపథ్యంలో రెండు పార్టీల మధ్య బూతు మాటలు పెరుగుతున్నాయి.
మాస్ గల్లీల్లో చిల్లరగాళ్లు వాడే బూతులు వీరు మాట్లాడుతుంటే చూడ ముచ్చటగా ఉందని కొందరంటున్నారు. బూతుల్లో వీరు పీహెచ్ డీ చేశారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బూతులు మాట్లాడటం వారికి అలవాటుగా మారింది. తెల్లవారు లేచింది మొదలు వారి నోటి వెంట బూతు పదాలే వస్తున్నాయి. దీంతో వారి మాటల్లో బూతు పదాలే కనిపించడం గమనార్హం.