ఫేక్ వీడియో కేసు... ఢిల్లీ పోలీసులతో రేవంత్ చెప్పిందిదే!!

ఆ ఫేక్ వీడియో వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు.

Update: 2024-05-02 03:55 GMT

రిజర్వేషన్స్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయాన్ని బీజేపీతో పాటు కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుని, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు! దీంతో... తెలంగాణ సీఎం రేవంత్ తన వెర్షన్ వినిపించారు.

అవును... తీవ్ర చర్చనీయాంశం అయిన కేంద్ర హోమంత్రి అమిత్ షా కి సంబంధించిన ఫేక్ వీడియో ఇష్యూ తీవ్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... తనకు అందిన నోటీసులకు రేవంత్ వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఆ ఫేక్ వీడియో వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఇదే సమయంలో... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు!

ఇదే సమయంలో... తాను సీఎంవో తెలంగాణ, పర్సనల్ ట్విట్టర్ ఖాతాలను మాత్రమే వినియోగిస్తున్నానని రేవంత్ పోలీసులకు తన సమాధానంలో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో తాజాగా.. ఆ నోటీసులపై రేవంత్ తరపు న్యాయవాది సౌమ్య గుప్తా వివరణ ఇచ్చారు. అమిత్ షా నకిలీ వీడియో షేర్ వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు లాయర్ సౌమ్య గుప్తా తెలిపారు.

మరోపక్క... ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు వివరణ ఇచ్చారు! ఇందులో భాగంగా... లోక్ ‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ అయిన సీఎం రేవంత్ తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు తెలిపారు.

కాగా... కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియో వ్యవహారంలో రేవంత్ రెడ్డి సహా పీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్ మన్నె సతీశ్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్ ‌కి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు.

Tags:    

Similar News