జగన్ కు మరో బిగ్ షాక్... ఈసారి బీజేపీ వంతు!
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచీ వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచీ వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలినాళ్లలోనే పలు ప్రచారాలు జరిగాయి.. ఈ మధ్య అవి కాస్తా వాస్తవరూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఎంపీ.. బైబై వైసీపీ అంటున్నారని తెలుస్తోంది.
అవును... వైసీపీకి ఇటీవల కాలంలో వరుస షాక్ లు తగులుతున్నాయి. భారీ ఎత్తున పార్టీని వీడుతున్న ద్వితీయ శ్రేణి నేతలు ఒకెత్తు అయితే.. పార్టీకి రాజీనామా చేస్తున్న సీనియర్ లీడర్ల జాబితా మరొకెత్తు అన్నట్లుగా ఉంది. ఇటీవల బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను లు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి ఆప్షన్ జనసేన!
ఇక ఇటీవల వైసీపీకి షాకిచ్చిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలలో మోపిదేవి వెంకటరమణ ఆప్షన్ టీడీపీ అని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇలా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పార్టీకి బై చెప్పి.. కొంతమంది టీడీపీలోకి, ఇంకొంతమంది జనసేనలోకీ వెళ్లిపోయారు. ఈ సమయంలో తాజాగా మరో ఎంపీ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నరని తెలుస్తోంది. ఇప్పటికే డిస్కషన్స్ పూర్తయ్యాయని అంటున్నారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణయ్యకు.. జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే... ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటింగ్ పై బీజేపీ ఫోకస్ పెట్టిందని అంటున్న నేపథ్యంలో... బీసీ సీఎం నినాదాన్ని ఇప్పటికే తెరపైకి తెచ్చింది.
గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఎంట్రీ ఇచ్చి.. ఎనిమిది అసెంబ్లీ, ఎనిమిది లోక్ సభ సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో... పార్టీలో బీసీ నాయకతాన్ని బలోపేతం చేయాలని బలంగా భావిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగానే... ఆర్. కృష్ణయ్యను వైసీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించిందని అంటున్నారు.
వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితే.. తమ పార్టీ తరుపున ఏపీ నుంచి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో కృష్ణయ్య ఈ ఆఫర్ కు ఆర్. కృష్ణయ్య సానుకూలంగా స్పందించారని అంటున్నారు.
కాగా... గతంలో ఆరెస్సెస్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్ కృష్ణయ్య.. ఏబీవీపీ నుంచే బీజేపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే.. గడిచిన రెండేళ్లుగా ఆయన వైసీపీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో... ఆయన పార్టీ మారుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే.. ఆ ప్రచారాన్ని కృష్ణయ్య ఖండించారు. మరి తాజా ప్రచారంపై కృష్ణయ్య ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.