బన్నీ, ప్రభాస్ పేర్లు చెప్పి పవన్ ని తగులుకున్న రోజా!

మరి ఇప్పుడు లోకేష్ పై కేసులు పెట్టాలని.. ప్రభాస్, అల్లు అర్జున్ పై పోస్టులు పెట్టినవారిపైనా చర్యలు తీసుకోవాలని రోజా పవన్ ను డిమాండ్ చేశారు!

Update: 2024-11-09 16:21 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని.. 5 నెలల్లో 90కి పైగా మహిళలపై దాడులు జరిగాయని వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క... ఏపీలో లా & ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

తన కుటుంబంలోని ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా పోస్టులు పెడుతున్నారని.. అయినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఆయన ఫైరయ్యారు. దీంతో... ఇప్పుడు పోలీసుల దృష్టంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపైనే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రోజా స్పందించారు.

అవును... ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్న వ్యవహారం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నియంత్రించలేక ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని.. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్కే రోజా మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో... పోలీసులు కనిపించే మూడు సింహాలకూ సెల్యూట్ చేయాలని కానీ.. కూటమిలోని మూడు పార్టీలకూ కాదంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని పెద్దలకు కీలక ప్రశ్నలు సంధించారు.

ఇందులో భాగంగా... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఇంట్లోని వారే మహిళలా.. వైసీపీ నేతల ఇళ్లల్లో మహిళలు లేరా అని రోజా ప్రశ్నించారు. గతంలో చేసిన పోస్టుల ఆధారంగా వైసీపీ వాళ్లపై కేసులు పెట్టిస్తున్న పవన్... లోకేష్ పైనా కేసులు పెట్టించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా... పవన్ కు మహిళలపై గౌరవం లేదని చెప్పిన రోజా.. హీరో ప్రభాస్ మీద మెగా ఫ్యాన్స్, జనసైనికులు పెట్టిన ఘోరమైన పోస్టులను తప్పని ఏనాడైనా ఆపారా..? వారిపై కేసులు పెట్టారా..? అల్లు అర్జున్ పైనా, ఆయన కుటుంబం పైనా పవన్ ఫ్యాన్స్ దిగజారుడుతనంతో పోస్టులు పెడితే దానిని ఆపారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక.. గతంలో తన తల్లిని లోకేష్ నీచంగా చిత్రీకరించారని అప్పట్లో అన్నారని.. మరి ఇప్పుడు లోకేష్ పై కేసులు పెట్టాలని.. ప్రభాస్, అల్లు అర్జున్ పై పోస్టులు పెట్టినవారిపైనా చర్యలు తీసుకోవాలని రోజా పవన్ ను డిమాండ్ చేశారు! హిట్లర్, గడాఫీ ఇద్దరూ కలిసి కూర్చిని పాలిస్తే ఎలా ఉంటుందో.. ఏపీలో అలాంటి పాలన సాగుతోందని రోజా విమర్శించారు!

Tags:    

Similar News