మమత కోటలో అరెస్సెస్ హిందూత్వ నినాదం

అలా ఇమడలేని వారు వేరేగా ఉంటారు. వారే ప్రత్యేక దేశం కోరుకుంటారు కోరుకుంటారు అని పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

Update: 2025-02-17 03:51 GMT

పశ్చిమ బెంగాల్ లో హిందూత్వ నినాదాన్ని బలంగా వినిపిస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్). వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగానే ఆరెస్సెస్ సభలు సదస్సులు నిర్వహిస్తోంది. ఆదివారంలో ఈ సదస్సులు మొదలయ్యాయి.

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ఆయన నిర్వహించిన సమావేశంలో హిందూత్వ గురించి గట్టిగా చెప్పారు. హిందూత్వ అన్నేది భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. హిందూత్వ సహజ లక్షణం అందరినీ తనలో తీసుకోవడం అన్నారు.

అలా ఇమడలేని వారు వేరేగా ఉంటారు. వారే ప్రత్యేక దేశం కోరుకుంటారు కోరుకుంటారు అని పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఆరెస్సెస్ ఎపుడూ హిందూ సమాజం గురించి ఆలోచించడానికి కారణాలను ఆయన చెప్పారు. దేశంలో బాధ్యతాయుతమైన పాత్రను హిందూ సమాజం పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

బాధ్యత కలిగిన సమాజం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది హిందూ సమాజమే అని కితాబు ఇచ్చారు. కేవలం దేశంలోనే కాదు, ప్రపంచంలోని భిన్నత్వాన్ని కూడా హిందువులు చక్కగా అర్ధం చేసుకుని తమ జీవనం సాగిస్తూంటారు అని భగవత్ అన్నారు.

ఈ విధంగా హిందూత్వ గురించి భగవత్ చాలా గొప్పగా చెప్పారు. ఆయన పశ్చిమ బెంగాల్ లో పది రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సదరంగా ఈ తరహా సదస్సులను మరిన్నిటిలో ఆయన పాలు పంచుకుంటారు. అలాగే ఆరెస్సెస్ ఏర్పాటు చేసే మేధో మధన సదస్సులో ఆయన ప్రసంగాలు చేస్తారు.

బెంగాల్ లో ఎన్నికలు నేపథ్యంలో హిందూత్వ నినాదాన్ని గట్టిగా ఆరెస్సెస్ వింపించడం వెనక హిందువుల ఓట్లను పోలరైజ్ చేసే ఆలోచన ఉందని అంటున్నారు. నాలుగవ సారి వరసగా మమతా బెనర్జీ గెలవదని గెలవకూడదని ఆరెస్సెస్ బీజేపీ గట్టిగా కోరుకుంటున్నాయి.

ఇక ఆరెస్సెస్ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఏడాది ముందుగా వెళ్ళి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తుది. ఆ మీదట తనదైన కార్యాచరణ మొదలెడుతుంది. ఇపుడు ఆరెస్సెస్ ఆ విధంగా బెంగాల్ లోకి ప్రవేశించిందా అన్న చర్చ సాగుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరెస్సెస్ సభలను అనుమతి ఇవ్వకపోయినా కోర్టు ద్వారా తెచ్చుకుని మరీ నిర్వహిస్తున్నారు అంటే ఆరెస్సెస్ బెంగాల్ మీద గట్టిగా గురి పెట్టింది అని అంటున్నారు.

ఈసారి బెంగాల్ లో హిందూత్వ నినాదం ఏ విధంగా మారు మోగుతుందో మరే విధంగా కమల వికాసానికి బాటలు పరుస్తుందో చూడాలి మరి . అలాగే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గద్దె దించుతుందో అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News