లోన్ తీసుకునే మహిళలు క్రెడిట్ స్కోర్ విషయంలో పక్కాగా ఉంటారట

చిన్న పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లోనిమహిళలు రుణాలని ఎక్కువగా తీసుకుంటున్నా.. తిరిగి చెల్లింపు విషయంలో వారు వ్యవహరించే తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.;

Update: 2025-03-04 09:30 GMT

చాలా విషయాల్లో మహిళలు చాలా పక్కాగా ఉంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆఫీసుల్లో మగ ఉద్యోగులతో పోలిస్తే.. మహిళా ఉద్యోగుల పని తీరు.. వారి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. మగాళ్ల మాదిరి లోన్ తీసుకొని క్రెడిట్ స్కోర్ గురించి పట్టని తీరుకు భిన్నంగా రుణాలు తీసుకున్న మహిళల వైఖరి వేరుగా ఉంటుందని చెబుతున్నారు. వీరు తమ క్రెడిట్ స్కోర్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటారని చెబుతున్నారు. ట్రాన్స్ యూనియన్ సిబిల్.. నీతి ఆయోగ్ లో వుమెన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్లాట్ ఫామ్.. మైక్రో సేవ్ కన్సల్టింగ్ సంయుక్తంగా చేసిన నివేదిక ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

చిన్న పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లోనిమహిళలు రుణాలని ఎక్కువగా తీసుకుంటున్నా.. తిరిగి చెల్లింపు విషయంలో వారు వ్యవహరించే తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు జాగ్రత్తగా వ్యవహరించటం వల్ల క్రెడిట్ స్కోర్ బాగుంటుందని చెబుతన్నారు. మిళలు తీసుకుంటున్న రుణాల్లో అధిక భాగం వ్యాపారం కంటే వినియోగ అవసరాలు తీర్చుకోవటానికే ఉపయోగిస్తున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

గడిచిన ఐదేళ్లలో లోన్ తీసుకునే మహిళల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ తిరిగి చెల్లింపుల విషయంలో వారు పక్కాగా ఉంటారని నివేదిక పేర్కొంది. మహిళలు తీసుకునే రుణాల్లో ఎక్కువగా వ్యక్తిగత రుణాలు.. మన్నికైన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు.. ఇంటిని కొనేందుకు రుణాలు తీసుకునే వారు 42 శాతంగా ఉంటారని.. వ్యాపారం కోసం రుణాలు తీసుకునే మహిళలు 3 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకునే వారు 38 శాతంగా ఉన్నారని రిపోర్టు వెల్లడించింది. వ్యాపారాల కోసం రునాలు తీసుకునే వారు 2019తో పోలిస్తే 4.6 రెట్లు పెరిగినట్లుగా పేర్కొన్నారు. 2024 డిసెంబరు నాటికి దేశంలో 2.7 కోట్ల మంది మహిళలు తాము తీసుకున్న రుణాల చెల్లింపు అంశాన్ని పరిశీలించి.. ఈ రిపోర్టు తయారు చేశారు. క్రెడిట్ స్కోర్ విషయంలో వారు జాగ్రత్తగా ఉంటారని.. సకాలంలో చెల్లింపులు జరుపుతారని పేర్కొంది. క్రెడిట్ స్కోర్ ను సొంతంగా పర్యవేక్షించుకునే మహిళల వాటా అంతకంతకూ పెరుగుతోంది.

Tags:    

Similar News