సచిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్.. మాస్టర్ సీరియస్!!
ఇలాంటి వీడియోలపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం ఈ డీఫ్ పేఫ్ వీడియోల బారిన పడ్డారు.
ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడి ఉన్నారు. ప్రధానంగా హీరోయిన్స్ ఈ వీడియోలతో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వీడియోలపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం ఈ డీఫ్ పేఫ్ వీడియోల బారిన పడ్డారు.
అవును... ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వీడియోలపై సెలబ్రిటీల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒక ఆన్ లైన్ గేమింగ్ యాప్ కు సచిన్ ప్రచారం చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
దీంతో ఈ విషయపై సచిన్ స్పందించారు. ఇందులో భాగంగా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వీడియోపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ డీప్ ఫేక్ వ్యవహారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.
తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన సచిన్... ఈ వీడియోలు నకిలీవని.. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని.. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు ఎక్కడ కన్పించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇదే సమయంలో ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కోరారు.
కాగా... ఆ మధ్య సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. టీం ఇండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా క్లోజ్ గా ఉన్నట్లు మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి! వాస్తవానికి అవి సారా తన సోదరుడు అర్జున్ తో ఉన్న ఫొటోలు కాగా.. వాటిని డీప్ ఫేక్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది!