'సంక్రాతికి వస్తున్నాం' సినిమాపై హైకోర్టులో పిల్... తెరపైకి క్విడ్ ప్రోకో!
రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించిందనే ప్రచారాలకు ఇదే కారణం అని చెబుతున్నారు.
ఈ ఏడాది సంక్రాతికి విడుదలైన సినిమాల్లో "సంక్రాంతిని వస్తున్నాం" సినిమా ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణకు నోచుకుందని చెబుతున్నారు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించిందనే ప్రచారాలకు ఇదే కారణం అని చెబుతున్నారు. ఈ సమయంలో ఓ అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈ సినిమాపై హైకోర్టులో పిల్ దాఖలైంది!
అవును... "సంక్రాంతికి వస్తున్నాం" ఈ ఏడాది సంక్రాతికి విడుదలైన సినిమాలో సూపర్ హిట్స్ లో ఒకటని అంటున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఈ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో క్విడ్ ప్రోకోకూ పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు!
వాస్తవానికి ఈ "సంక్రాంతిని వస్తున్నాం" సినిమా విడుదలై ఘన విజయం సాధించింది అని చెప్పడంతో పాటు రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించిందనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.
ఆ వ్యవహారం అలా ఉంటే.. ఇప్పుడు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవ్వడం సంచలనంగా మారిందని అంటున్నారు. ఈ పిటిషన్ లో ప్రధానంగా... ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటీషనర్ పేర్కొన్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.