కరోనా తర్వాత మరో టెన్షన్ స్టార్ట్... ఏమిటీ హెచ్5ఎన్1 వైరస్?
ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో తీవ్ర బర్డ్ ఫ్లూ కేసు నమోదైందనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోందని అంటున్నారు.
గతంలో ప్రపంచాన్ని వణికించేసిన మహమ్మారి కరోనా వైరస్ గురించి దాదాపు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ప్రపంచ దేశాలను అన్ని విధాలుగానూ తీవ్రంగా నష్టపరిచిన వైరస్ అది. దాని పేరు చెబితే ఇప్పటికీ వణికిపోయే కుటుంబాలు, దేశాలూ ఉన్నాయన్నా అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో తాజగా మరో వైరస్ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
అవును... కరోనా వైరస తర్వాత మానవాళిపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే.. ఇప్పటికే ఈ వైరస్ పని మొదలుపెట్టిందని అంటున్నారు. ఇందులో భాగంగా.. మనుషులకు సోకడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో తీవ్ర బర్డ్ ఫ్లూ కేసు నమోదైందనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా లూసియానాలో ఓ రోగికి ఏవియన్ ఇన్ ఫ్లుయేంజా కి సంబంధించిన తీవ్రమైన ఇన్ ఫెక్షన్ ను గుర్తించారట అధికారులు. దీనిపై స్పందించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)... ఇది అమెరికాలో గుర్తించబడిన తొలి తీవ్రమైన బర్డ్ ఫ్లూ కేసు అని ప్రకటించింది. దీంతో... అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకినవారి సంఖ్య 61కి పెరిగిందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన శాస్త్రవేత్తలు.. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1 జన్యురూపానికి చెందినదని తేల్చారని అంటున్నారు. ఈ జన్యురూపం ఇటీవల అమెరికాలోని అడవి పక్షులు, ఫౌల్ట్రీ ఫాం లలో కనుగొన్నట్లు తెలిపారు. అయితే... బర్డ్ ఫ్లూ మనిషి నుంచి మనిషికి వ్యాపించడానికి సూచించే తగిన ఆధారాలు ఇంకా లభ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు.
ఈ బర్డ్ ఫ్లూనే ఏవియన్ ఇన్ ఫ్లుయోంజా వైరస్ గా పిలుస్తారు. ఇది సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. అయితే... రాష్ట్రంలో మానవులలో బర్డ్ ఫ్లూ కేసులు పెరగడంతో కాలిఫోర్నియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.