డైలమాలో షర్మిల.. అనుకున్నట్టుగా లేదా..!
అడుగడుగునా.. షర్మిలకు అనేక చిక్కులు కనిపిస్తున్నాయి. వైఎస్ మిత్రులు.. కలిసి వస్తారని అనుకు న్నా వారంతా మౌనంగానే ఉన్నారు.
ఎన్నికలకు ఆట్టే సమయం లేదు. పగ్గాలు తీసుకున్నదా.. పార్టీని గట్టెక్కించడానికి లేదా లైన్‌లో అయిన పెట్టడానికి..! కానీ, క్షేత్రస్తాయిలో పరిస్తితిని ముందుగాఅంచనా వేసుకోలేక పోవడంతో కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన షర్మిల డైలమాలో పడ్డట్టు కనిపిస్తోంది. తాను ఏదో చాలానే ఊహించుకుని.. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. వైఎస్ తనయగా.. తనకు తిరుగు ఉండదని.. తాను అడుగు వేస్తే.. తన వెనుక వేలాది అడుగులు కదలుతాయని ఆమె ఆశించి ఉంటారు. కానీ, అలాంటి పరిస్తితి ఇప్పుడు లేదు.
అడుగడుగునా.. షర్మిలకు అనేక చిక్కులు కనిపిస్తున్నాయి. వైఎస్ మిత్రులు.. కలిసి వస్తారని అనుకు న్నా వారంతా మౌనంగానే ఉన్నారు. ఇక, కాంగ్రెస్ కేడర్ పుంజుకుంటుందని భావించినా.. అది కూడా.. ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మరోవైపు టార్గెట్ రెడీగా ఉంది. దీంతో షర్మిల ఇప్పుడు వ్యూహాలు మారుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి పట్టుమని నాలుగు రోజులు కూడా కాకుండానే.. ఆమె రెండో వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు.
తొలుత నియోజవకర్గాల్లో పర్యటించి.. పార్టీనిబలోపేతం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇచ్ఛాపురం నుంచి నియోజకవర్గాల యాత్ర ప్రారంభించారు. కేడర్‌తో భేటీలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇది సుదీర్ఘ ప్రాసెస్ కావడం.. 175 నియోజకవర్గాలను టచ్ చేసేందుకు సమయం పడుతుండడంతో ఆమె ప్లేటు మార్చారు. ఇప్పుడు తాజాగా బస్సు యాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా నియో జకవర్గాల స్థాయిని పక్కన పెట్టి.. జిల్లాలను ఎంచుకున్నారు.
అదే శ్రీకాకుళం నుంచి రెండు మూడురోజుల్లోనే ఆమె బస్సు యాత్ర ద్వారా.. జిల్లాలను చుట్టేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తద్వారా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి.. జిల్లాల పర్యటనలు పూర్తి చేసి.. తర్వాత.. నేరుగా.. ప్రచారపర్వం ప్రారంభించాలని నిర్ణయించారట. జిల్లాల పర్యటనకు సంబంధించి ప్రత్యేకంగా సకల వసతులు ఉన్న ఒక బస్సును అందుబాటులోకి తీసుకు న్నారని సమాచారం. ఏదేమైనా పార్టీని బలోపేతం చేయడం.. లైన్‌లో పెట్టడం.. అనే టార్గెట్‌ను ఛేదించ డంలో షర్మిల డైలామాలో పడ్డారనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.