ఆ శునకం సోనియమ్మకు అంత ఇష్టమట

కానీ.. అందుకు భిన్నంగా ఉన్న ఫోటో ఒకటి సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు.

Update: 2024-08-25 05:01 GMT

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని గుర్తుకు తెచ్చుకుంటే.. చాలా సీరియస్ గా ఉన్న ఫోటోలు.. లేదంటే తీవ్రంగా చర్చిస్తున్నట్లుగానో.. లేదంటే దీర్ఘాలోచనలో ఉన్నట్లుగానో ఉంటాయి. ఒకేలాంటి ఫ్రేమ్.. ఒకేలాంటి ఫీలింగ్ తప్పించి.. అందుకు భిన్నమైన ఫోటోలు కనిపించవు. కానీ.. అందుకు భిన్నంగా ఉన్న ఫోటో ఒకటి సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇలాంటి ఫోటోలో సోనియాగాంధీని చూసింది లేదని చెప్పాలి. ఇంతకు ఆ ఫోటోలో ఏముందంటే.. ఇప్పుడు ఆమెకు అత్యంత ఇష్టంగా ఒక శునకాన్ని సాకుతున్నారు. దాని పేరు నూరీ. జాక్ రసెల్ టెరియర్ జాతికి చెందిన ఈ కుక్కను గత ఏడాది సోనియాగాంధీకి బహుమతిగా ఇచ్చారు రాహుల్ గాంధీ. అప్పటి నుంచి ఆ శునకం సోనియా గాంధీ వెంటే ఉంది. ఈ ఏడాదిలో ఆమె ఆ శునకానికి దగ్గరయ్యారు. నూరీ అంటే సోనియాకు చాలా ఇష్టమని చెబుతారు.

ఇదే విషయాన్ని తాజాగా రాహుల్ గాంధీ సైతం తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. ‘అమ్మకు ఇష్టమైనది’ అన్న క్యాప్షన్ తో ఉన్న ఫోటోలో.. సోనియా వీపున ఉన్న చిట్టి బ్యాగ్ లో ఉన్న కుక్కపిల్లను ఆమె మోస్తూ.. ఫోటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటోను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇప్పటికే మిలియన్ లైక్ లు దాటేయటమే కాదు.. బోలెడన్ని కామెంట్లు చేస్తున్నారు. ఏమైనా.. సోనియాగాంధీని రోటీన్ కు భిన్నమైన ఫోజులో చూడటం కాంగ్రెస్ వాదుల్ని మాత్రమే కాదు.. గాంధీ కుటుంబాన్ని అభిమానించే వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఫోటోలో ఆమె ఆరోగ్యంగా.. అంతకు మించిన ఆనందంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News