ఇన్నాళ్ల తర్వాత ట్యాంక్ బండ్ మీద మరో విగ్రహం

ఒకప్పుడు ట్యాంక్ బండ్ అన్నంతనే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ వచ్చే ప్రతి ఒక్కరి జాబితాలో ట్యాంక్ బండ్ తప్పనిసరిగా ఉంటుంది

Update: 2024-03-04 06:02 GMT

ఒకప్పుడు ట్యాంక్ బండ్ అన్నంతనే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ వచ్చే ప్రతి ఒక్కరి జాబితాలో ట్యాంక్ బండ్ తప్పనిసరిగా ఉంటుంది. అప్పట్లో రాజకీయ వర్గాలు సైతం ట్యాంక్ బండ్ కు సముచిత స్థానాన్ని ఇచ్చేది. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరిందో దాన్ని పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి. ట్యాంక్ బండ్ అన్నది అప్రాధాన్యతగా మారింది. మళ్లీ రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత నుంచి ప్రాధామ్యాలలో మార్పు వచ్చేసింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన్నుతలుచుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆయన ఆకాంక్షలకు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో.. ట్యాంక్ బండ్ ప్రస్తావన మళ్లీ తెర మీదకు వచ్చింది.

తన తండ్రి ఆశయాల్ని నెరవేర్చటానికి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చెప్పిన శ్రీధర్ బాబు.. తన తండ్రి దేశానికి స్ఫూర్తిదాయకమైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రధాన శిష్యుడిగా ఉన్నారన్నారు. ప్రజల కోసం సేవ చేస్తూ.. ఆయన ప్రాణాలు కోల్పోవటాన్ని ప్రస్తావించారు. శ్రీపాదరావు జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం తరఫున నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ తీరును అభినందించారు. మొత్తంగా చాలా రోజుల తర్వాత ట్యాంక్ బండ్ ప్రస్తావన తెలుగు రాజకీయాల్లోకి రావటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News