సుచిర్ బాలాజీ మృతిపై ఓపెన్ ఏఐ నుంచి ఆసక్తికర రియాక్షన్!
ఈ సమయంలో తాజాగా ఓపెన్ ఏఐ సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... సుచిర్ బాలాజీ తమ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగారని.. అతడి మృతి తమను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
చాట్ జీపీటీ మాతృ సంస్థ "ఓపెన్ ఏఐ"లో నాలుగేళ్లు పరిశోధకుడిగా పనిచేసిన విజిల్ బ్లోయర్, భారత సంతతి వ్యక్తి సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మృతిపై పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సుచిర్ బాలాజీ తల్లి పూర్ణిమారావు ఓపెన్ ఏఐపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో సంస్థ స్పందించింది.
అవును... ఓపెన్ ఏఐలో పరిశొధకుడిగా పనిచేసిన సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన అతడి తల్లి పూర్ణిమారావు.. ఓపెన్ ఏఐ పై సంచలన ఆరోపణలు చేశారు.. పలు ప్రశ్నలు సంధించారు.. తన కుమారుడి మృతిని అధికారులు కేవలం 14 నిమిషాల్లో ఆత్మహత్యగా తేల్చేశారని అన్నారు.
ఈ సమయంలో తాజాగా ఓపెన్ ఏఐ సంస్థ స్పందించింది. ఇందులో భాగంగా... సుచిర్ బాలాజీ తమ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగారని.. అతడి మృతి తమను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసులో ఏదైనా సాయం అవసరం అయితే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. దీనిపై ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులను సంప్రదించినట్లు తెలిపారు.
కాగా... సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి విషయంలో ఓపెన్ ఏఐ పై అతడి తల్లి పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తన కుమారుడిని ఆ సంస్థే హత్య చేసిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఆ కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నట్లు ఆమె ఆరోపించారు.
ఇదే సమయంలో... కేవలం 14 నిమిషాల వ్యవధిలోనే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చేశారని.. తన కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడని.. అతడికి ఆత్మహత్య ఆలోచన ఉంటే ఆ వేడుకలు జరుపుకునేవాడా అని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ స్పందించింది.